మూడు ముళ్లు.. ఏడడుగుల బంధానికి ఆ భర్త ఉరితీశాడు. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పెనిమిటి.. తన స్నేహితుడి కోరిక తీర్చాలంటూ.. చిత్ర హింసలకు గురి చేశాడు. అంతేకాదు.. ఎంత సేపూ.. నాకే కాదు.. మనవాళ్లకు కూడా సుఖాన్ని పంచాలి.. అని కొత్త హితవులు కూడా పలికేవాడు. ఈ అకృత్యాలు భరించలేని ఆ పడతి.. పోలీసులను ఆశ్రయించింది. ఇది మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనే జరగడం.. అందునా.. ఉన్నత విద్యను అభ్యసించిన వాడే చేయడం.. తీవ్ర విషాదానికి దారితీసేలా చేసింది.
కర్ణాటకలోని తనిసంద్ర ప్రాంతంలో నివాసముంటున్న మహిళకు 2011లో జాన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారిద్దరికి రెండేళ్ల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. కుటుంబం హ్యాపీగా సాగుతోంది. ఇద్దరూ కూడా ఉన్నత చదువు చదువుకున్నవారే. మంచి ఉద్యోగాలు కూడా. అయితే.. ఇటీవల కొంతకాలంగా జాన్‌లో మార్పు వచ్చింది. మద్యానికి బానిసయ్యాడు. భార్యను అనుమానించడం ప్రారంభించాడు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి విధ్వంసం సృష్టించేవాడు. భార్యను కొట్టి హింసించేవాడు.
2015లో జాన్ తన స్నేహితులతో సెక్స్లో పాల్గొనమని భార్యను జాన్ బలవంతపెట్టాడు. దానికి నిరాకరించిన ఆమెను వివిధ రకాలుగా టార్చర్ పెట్టాడు. ఆ హింసను భరించలేక ఆమె రెండుమూడు సార్లు జాన్ స్నేహితులిద్దరితో సెక్స్లో పాల్గొంది. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా కొన్ని ఫొటోలను తీసి వాటిని దాచుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు జాన్. పదే పదే తను కోరిన వారితో సెక్స్ చేయాలని చెప్పేవాడు. గద్దించేవాడు.
ఉద్యోగ రీత్యా 2019లో తమ ఇంట్లో ఉండేందుకు వచ్చిన మహిళ సోదరిపై జాన్ కన్నేశాడు. ఆమెను కూడా తన ఫ్రెండ్స్తో సెక్స్లో పాల్గొనేలా చేయాలంటూ భార్యను ఒత్తిడి చేశాడు. దీనికి నిరాకరించిన జాన్ భార్య.. వివాహ బంధాన్ని తెంచుకునేందుకు రెడీ అయింది. దీంతో రగిలిపోయిన జాన్.. భార్య అని కూడా చూడకుండా.. తన స్నేహితులతో సెక్స్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు.
దీంతో ఆ ఆలోచన విరమించుకుంది. కానీ అతడి టార్చర్ తట్టుకోలేక మరోసారి డిసంబర్ 4న విడాకులు అడిగింది. దీంతో ఆమె వాట్సాప్కు రెండు ప్రైవేట్ ఫొటోలను జాన్ పంపించాడు. ఆమెకు పంపించినట్లే మిగతా అందరికి పంపిస్తానని హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన మహిళ పోలీసులను ఆశ్రయించింది. సో.. సమాజంలో ఇలాంటి భర్తలు కూడా ఉంటారా? అని జాలిపడడం తప్ప ఏం చేయాలో తెలియని పరిస్థితి!!
This post was last modified on December 11, 2022 9:01 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…