భర్తలను చంపేస్తున్న భార్యల ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రియుడికోసమో.. లేక కుటుంబ తగాదాలో కారణాలు ఏవైనా తాళికట్టిన భర్తలను భార్యలే కడదేరుస్తున్నారు. అయితే.. ఆయా ఘటనల్లో కెల్లా ఇప్పుడు వెలుగు చూసిన ఘటన.. పీక్ అనే అనాలి.
ఎందుకంటే.. సెక్స్+ మనీ కోసం.. భర్తను ఓ భార్య దారుణంగా చంపేసింది. ముందు రౌడీలతో కొట్టించి.. చంపించే ప్రయత్నం చేసింది. కానీ, ఉక్కు పిండమేమో.. బతికిపోయాడు. తర్వాత.. క్రైమ్ సీరియల్ చూసి.. దానిలో విలన్‌ను చంపేసినట్టుగా.. అచ్చం అదేవిధంగా భర్తను చంపేసింది.
దారుణమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో జరిగింది. కాన్పూర్కు చెందిన రిషబ్, స్పప్న భార్యాభర్తలు. వీరిద్దరు కల్యాణ్పుర్లో నివాసం ఉంటున్నారు. నవంబర్ 27న తన స్నేహితుడు మనీశ్తో కలిసి ఓ పెళ్లికి వెళ్లాడు రిషబ్. అనంతరం తిరిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు రిషబ్పై దాడి చేశారు.
తీవ్రంగా గాయపడిన అతడు.. చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కొన్నిరోజులకు కోలుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. డిసెంబర్ 3న మళ్లీ అతడి ఆరోగ్యం క్షీణించింది. మరోసారి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు రిషబ్.
అనంతరం భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది స్వప్న. తన భర్త మరణంపై అనుమానాలున్నాయని విచారణ జరిపించాలని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రిషబ్ మృతదేహానికి పోస్ట్మార్టం పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికలో మందులు ఎక్కువ డోస్లో తీసుకోవడం వల్లే చనిపోయాడని తేలింది. అయితే, ఇదతా కూడా ఆమె వ్యూహాత్మకంగా చేసినట్టు పోలీసులు గుర్తించారు.
స్పప్నపైనే అనుమానంతో విచారణ చేసిన పోలీసులు.. మొబైల్ ఫోన్ ఆధారంగా నిజనిజాలు రాబట్టారు. రిషబ్ భార్యనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వారు తేల్చారు. తన ప్రియుడు రాజుతో కలిసి.. స్పప్న తన భర్తను చంపేందుకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు నిర్ధరించారు. భర్తను కొట్టించి చంపించేందుకు ప్రయత్నించగా చికిత్స పొంది బతికాడని, అనంతరం అధిక మోతాదులో మందులు ఇచ్చి చంపినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
తన భర్త పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయని, వాటి గురించి అడిగినప్పుడల్లా విషయం దాటవేసేవాడని స్పప్న తెలిపింది. ఆస్తి తనకు ఇవ్వకుండా మరెవరికైనా ఇస్తాడేమోనని భావించి రిషబ్ను ఆమె చంపినట్లు ఒప్పుకుంది.
అదే విధంగా ప్రియుడి కోసం కొత్తగా ఇల్లు కూడా కొన్నదని.. భర్తను చంపేసి వేరే కాపురం పెట్టాలని నిర్నయించుకున్నారని తెలిపారు. ఇదంతా కూడా హిందీలో వస్తున్న డైలీ క్రైమ్ సీరియల్ చూసి అనుకరించినట్టు పోలీసులు చెప్పడం.. షాకింగ్ పరిణామం.
This post was last modified on December 10, 2022 10:52 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…