ట్విట్టర్లో ఏవేవో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండవుతూ ఉంటాయి. వాటి మీద వేలు, లక్షల్లో ట్వీట్లు పడుతుంటాయి. ఆ హ్యాష్ ట్యాగ్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు చిత్రంగా ట్విట్టర్ మీద నెగెటివ్ హ్యాగ్‌లు అదే ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండడం విశేషం.
#RipTwitter #$Goodbytwitter #Twitterdown… ఇవీ నిన్నట్నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్‌లు. వరల్డ్ వైడ్ ఈ హ్యాష్ ట్యాగ్ వీర లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్లో ఎప్పుడూ వేరే అంశాలు చర్చనీయాంశం అవుతుంటాయి కానీ.. ట్విట్టరే ఇలా హాట్ టాపిక్ కావడం.. దాని గురించి విపరీతమైన నెగెటివిటీ కనిపించడం విడ్డూరం. ఇదంతా నెల కిందట ట్విట్టర్‌ను టేకోవర్ చేసి ఉద్యోగులతో పాటు యూజర్లకు కూడా షాక్‌లు మీద షాక్‌లు ఇస్తున్న వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మాస్క్ ఫుణ్యమే.
ట్విట్టర్ తన చేతికి రాగానే దాని సీఈవో సహా పాత కార్యవర్గాన్ని మొత్తం ఎలాన్ మాస్క్ సాగనంపేసిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా వేల మంది పాత ఉద్యోగులను కూడా పీకేశాడు. మిగతా ఎంప్లాయిస్ మెడ మీదా కత్తి వేలాడుతోంది. దీనికి తోడు వారానికి పని గంటలు పెంచుతూ అనేక ఆంక్షలు విధిస్తూ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు మస్క్.
మరోవైపు డబ్బులు పెట్టి బ్లూ టిక్ కొనుక్కునే ఆప్షన్ మీద విపరీతమైన గందరగోళం నడుస్తోంది. ఇంకోవైపేమో ఇప్పుడున్న ట్విట్టర్ వెర్షన్ డౌన్ అవుతుందని.. ట్విట్టర్ 2.0 రాబోతోందని అంటున్నారు. అసలు ట్విట్టరే ఉండదనే చర్చ కూడా నడుస్తోంది.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి ట్విట్టర్ ఆగిపోతుందనే ప్రచారం గట్టిగా నడవడంతో రిప్ ట్విట్టర్ అని, గుడ్ బై ట్విట్టర్ అని, ట్విట్టర్ డౌన్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. మొత్తానికి ఎలాన్ మస్క్ ఏ ఉద్దేశంతో ట్విట్టర్‌ను టేకోవర్ చేశాడో కానీ.. అతనొచ్చి నెల తిరక్కుండానే ట్విట్టర్‌కు సంబంధించి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.
This post was last modified on November 20, 2022 6:47 am
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…