ట్విటర్‌లో 8 డాలర్లు చెల్లించి ఎవరైనా ఇకపై వెరిఫైడ్ అకౌంట్లకు ఇచ్చే బ్లూ టిక్‌ను సొంతం చేసుకునేలా ఇటీవలే సంస్థ అధినేత అయిన ఎలాన్ మస్క్ కొత్త సదుపాయాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీని పట్ల ట్విట్టర్ యూజర్లు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీని పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఐతే మున్ముందు స్పందన ఎలా ఉంటుందో కానీ.. ఈ కొత్త సదుపాయం వల్ల ఒక ఫార్మా సంస్థ ఏకంగా ఒక్క రోజు వ్యవధిలో రూ.1.22 లక్షల కోట్ల నష్టం చవిచూడడం చర్చనీయాంశంగా మారింది.
నెలకు 8 డాలర్లు చెల్లించి బ్టూటిక్ పొందే సదుపాయాన్ని ఉపయోగించుకుంటూ తాజాగా ఎలి లిల్లీ అండ్ కంపెనీ పేరుతో ఒకరు తమ ట్విటర్ ఖాతాకు బ్లూ టిక్ కొనుక్కున్నారు. నిజానికి ఇదే పేరుతో సదరు ఫార్మా కంపెనీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ ఉంది. కానీ ఎవరో ఆ సంస్థ పేరుతో నకిలీ ఖాతా తెరిచి.. దానికి బ్లూటిక్ కూడా సంపాదించారు. ఆ ఖాతా నుంచి వేసిన ట్వీట్ భారీ నష్టానికి దారి తీసింది.
ఎలి లిల్లీ అండ్ కంపెనీ మధుమేమ రోగులకు అవసరమైన ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను అమ్ముతూ ఉంటుంది ఐతే డూప్లికేట్ అకౌంట్ నుంచి తాజాగా.. ఇకపై మేం అందరికీ ఉచితంగా ఇన్సులిన్ ఇస్తాం.. అంటూ ట్వీట్ వేశారు. ఇలా ఉచితంగా ఇన్సులిన్ మందులు అమ్మితే కంపెనీ దివాళా తీస్తుందనే ప్రచారం జరగడంతో ఆ కంపెనీ షేర్లను అందరూ అమ్మేయడం మొదలుపెట్టారు. శుక్రవారం షేరు ధర సుమారు 4.37శాతం పడిపోయింది. 15 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను ఆ సంస్థ కోల్పోయింది.
ఈ మొత్తం మన రూపాయల్లో రూ.1.22 లక్షల కోట్లు కావడం గమనార్హం. ఎలి లిల్లీ అండ్ కంపెనీ ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి తమ అధికారిక ఖాతా నుంచి క్లారిటీ ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తానికి మస్క్ ట్విట్టర్లో తీసుకొచ్చిన కొత్త సదుపాయం పుణ్యమా అని ఒక కంపెనీకి ఒక్క రోజు రూ.1.22 లక్లల కోట్ల నష్టం వాటిల్లిందన్నమాట.
This post was last modified on November 12, 2022 10:49 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…