కరోనా ప్రపంచాన్ని ఎంతలా మార్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేయటమే కాదు.. రాజు..పేద.. అన్న తేడా లేకుండా భయపడేలా చేసింది. ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసింది. మొత్తంగా ప్రపంచం మొత్తం మారిపోయేలా చేయటమేకాదు.. కంటికి కనిపించకుండానే హడలిపోయేలా చేసింది. ఈ మహమ్మారి పుణ్యమా అని.. దేశాలకు దేశాలు కిందామీడా పడిపోతున్నాయి.
ఇదిలా ఉంటే.. కరోనా బాధితులకు సాయం చేసేందుకు.. రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మరే రాజకుటుంబం చేయని రీతిలో స్పెయిన్ రాణి వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వీడన్ రాణి సోఫియా తాజాగా తానే స్వయంగా రంగంలోకి దిగారు. వైద్యులపై ఒత్తిడిని తగ్గించేందుకు స్వీడన్ లోని సోఫియా హెమ్మెట్ వర్సిటీ కాలేజీ హెల్త్ కేర్ వాలంటీర్లకు ట్రైనింగ్ ఇస్తోంది.
ఈ కాలేజీకి గౌరవ ఛైర్ మెంబర్ అయిన సోఫియా.. కరోనా వేళ తాను సైతం ఆ మెలుకువలు నేర్చుకునేందుకు నిర్ణయించారు. మూడు రోజుల పాటు శిక్షణ పొందిన ఆమె.. కరోనా రోగులకు సేవలు అందించేందుకు వీలుగా సేవకురాలిగా మారి..తన పెద్ద మనసును చాటుకున్నారు. రోగులకు నేరుగా సాయం అందించకున్నా.. వారికి అందే సేవల్ని స్వయంగా పర్యవేక్షించటం.. అందుకు సంబంధించిన పనులు చేస్తున్న ఆమె తీరుకు ఫిదా అవుతున్నారు.
రాచరికాన్ని.. రాణి హోదాను వదిలేసి.. రోగులకు సాయం చేయటానికి ముందుకొచ్చిన సోఫియా పెద్దమనసును ఇప్పుడందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి తీరు అరుదుగా ఉంటుందని.. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని పొగిడేస్తున్నారు.
This post was last modified on April 22, 2020 1:48 pm
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…