సమాజంలో నేటికీ కూతుళ్లు అంటే.. భారం అనుకునే తండ్రులు ఉన్నారు. గర్భంలో ఉండగానే.. ఆడపిల్ల అని తెలిస్తే.. చాలు..ఏదో రూపంలో వదిలించుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే.. అమ్మ రూపమే అమ్మాయిగా మనకు జన్మిస్తుందని.. ఎంతో మంది చెబుతున్నా.. ఎవరూ వినరు. అమ్మో.. అమ్మాయా! అని తెగ బాధపడిపోతారు. తెగ ఫీలైపోతారు. కానీ, అమ్మాయిలు నిజంగా భారమా? వారు అంత బరువా.?? అంటే .. కానేకాదని నిరూపిస్తోంది.. ఆ సైనికుడి గారాల పట్టి. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటే.. చూసి తట్టుకోలేక తన కాలేయాన్ని దానం చేసి.. తండ్రికి జన్మనిచ్చింది.
లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న తన తండ్రికి కాలేయాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడింది ఓ కుమార్తె. తండ్రి ప్రాణాలు నిలిపేందుకు తన కాలేయంలో 60 శాతాన్ని ఇచ్చేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగింది. ఉంచపుల్ శిపపురానికి చెందిన విపిన్ కాంద్పాల్.. 1988 నుంచి 2009 వరకు సైన్యంలో పనిచేశాడు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరాడు. ఈ క్రమంలోనే ఆయనకు కాలేయం దెబ్బతింది. స్థానిక వైద్యులను సంప్రదించగా.. రిషికేశ్ ఎయిమ్స్కు సిఫార్సు చేశారు.
అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి వెళ్లాలని సూచించారు. దీంతో విపిన్..ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్, బిలియరీ సైన్సెస్ను ఆశ్రయించారు. విపిన్ కాలేయాన్ని పరిశీలించిన వైద్యులు.. అవయవ మార్పిడి చేయాలని చెప్పారు. దాత కోసం ప్రయత్నించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు విపిన్ను.. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఆరోగ్యం క్షీణించింది. మేదాంత వైద్యులు సైతం కాలేయ మార్పిడి తప్పదని చెప్పారు. దీంతో విపిన్ భార్య కాలేయ దానానికి ముందుకొచ్చారు.
అయితే, ఆమె లివర్కు కొవ్వు అధికంగా ఉందన్న కారణంతో కాలేయ మార్పిడి సాధ్యం కాలేదు. విపిన్ కుమారుడేమో బరువు తక్కువగా ఉన్నాడు. విపిన్ కూతురు ప్రియా తివారికి వివాహం కాగా.. పలు సమస్యల వల్ల ఆమె దానం చేయలేకపోయారు. దీంతో ఆయన చిన్నకూతురు పాయల్ కాంద్పాల్.. పెద్ద మనసు చేసుకుంది. ఆప్తమాలజీ(నేత్ర శాస్త్రం) చదువుతున్న పాయల్.. కాలేయ దానానికి ముందుకొచ్చింది. భవిష్యత్లో ఏదైనా సమస్యలు రావొచ్చని వైద్యులు, సన్నిహితులు చెప్పినా.. దానంపై వెనకడుగు వేయలేదు. స్వచ్ఛందంగా తన కాలేయంలోని 60 శాతం భాగాన్ని తండ్రికి దానం చేసింది.
చివరకు ఆపరేషన్ సక్సెస్ అయింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. పాయల్ చాలా కాన్ఫిడెంట్ ఉందని, అందువల్ల వేగంగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇన్నేళ్లు తనను పెంచిన తండ్రి కోసం అవయవదానం చేయడం గర్వంగా ఉందని పాయల్ చెబుతోంది. తండ్రి ప్రాణం కాపాడటం కన్నా గొప్ప అదృష్టం ఇంకేముంటుందని అంటోంది. అవయవదానానికి ముందుకొచ్చిన పాయల్పై ప్రశంసలు కురుస్తున్నాయి. అదేసమయంలో కూతుర్లంటే భారమనుకునే తండ్రులకు.. పాయల్ కనువిప్పు కలిగించింది.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…