ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కేటాయించారని.. విమర్శిస్తున్న గుడ్డివారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని.. ఎవరు ఎలాంటివారో ప్రజలకు తెలుసన్నారు. అచ్చెన్నాయుడుకి వచ్చే ఎన్నికల్లో ఎవరు దద్దమ్మలో తెలుస్తుందని తమ్మినేని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకి వారేం చేశారో.. మేం ఏం చేశామో.. తేల్చుకుందాం.. చర్చకు రండి అని సవాల్ విసిరారు.
అయితే చర్చకు మాత్రం అచ్చెన్నాయుడు లాంటి పానకంలో పుడకలు వద్దన్నారు. డైరక్ట్‌గా టీడీపీ అధినేత చంద్రబాబుకి సవాల్ విసురుతున్నానన్నారు. ఉత్తరాంధ్రకు 3 ఏళ్లలో మేం ఏం చేశామో… 14 ఏళ్లలో ఆయన ఏం చేశారో చర్చిద్దాం రావాలన్నారు. పేర్లు మార్చిన ఘనత టీడీపీదేనన్నారు. తన దగ్గర చాంతాడంత లిస్ట్ ఉందని తమ్మినేని పేర్కొన్నారు. ఎవరు ఎలాంటి వారో తనకు తెలుసునన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
కాగా.. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు.. ఇదేచంద్రబాబును.. పొగడ్తలతో ముంచెత్తిన వీడియోను టీడీపీ నేత లు వెంటనే విడుదల చేశారు. ఆ వీడియోల్లో ఒకప్పుడు.. చంద్రబాబు ను టికెట్ కోసం.. అభ్యర్థిస్తున్నట్టు ఉండడం గమనార్హం. తర్వాత.. సీతారాం.. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత.. వైసీపీలోకి వచ్చారు. ఇలా.. ఆయన రాజకీయ చరిత్రను ఉటంకిస్తూ.. టీడీపీనేతలు ఒక వీడియోను వైరల్ చేయడం.. గమనార్హం. మొత్తానికి స్పీకర్ స్తానంలో ఉండి.. రాజకీయాలు మాట్టాడడం.. ఇలా సవాళ్లు రువ్వడం వంటివి తీవ్ర వివాదానికి దారితీస్తుండడం గమనార్హం.. అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 28, 2022 10:07 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…