Movie News

వందల కోట్లు కుమ్మరిస్తున్న నెట్ ఫ్లిక్స్

విపరీతమైన పోటీ నెలకొన్న ఓటిటి ప్రపంచంలో వరల్డ్ వైడ్ నెంబర్ వన్ గా ఉన్న నెట్ ఫ్లిక్స్ ఇండియాలో మాత్రం తడబడుతూనే ఉంది. మొదట్లో దీని ధరలు మధ్యతరగతి ప్రేక్షకులు భరించేలా లేవనే ఫిర్యాదు బలంగా వినిపించేది. ప్రైమ్ లాంటి భారీ కంటెంట్ ఉన్న ప్లాట్ ఫార్మ్ ఏడాదికి పదిహేను వందలు తీసుకుంటూ నలుగురు పంచుకునే వెసులుబాటు ఇస్తుండగా అదే సౌకర్యం పొందాలంటే నెట్ ఫ్లిక్స్ కు మాత్రం చాలా ఎక్కువ మొత్తం కట్టాలి. అందుకే గత ఏడాది ఈ సంస్థకు మన దేశపు ఆర్థిక ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించాయి. యుద్ధ ప్రాతిపదికన రేట్లు తగ్గించింది కానీ పూర్తిగా కోలుకోలేదు .

తానేం మిస్ అవుతోందో ఆలస్యంగా అయినా నెట్ ఫ్లిక్స్ ఎట్టకేలకు గుర్తించింది. రీజనల్ కంటెంట్ ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం ఇంటర్నేషనల్ మూవీస్, వెబ్ సిరీస్ ఇచ్చినంత మాత్రాన సగటు ఇండియన్ వ్యూయర్ ఆసక్తి చూపించడని అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా భారీ ప్రోజెక్టులను ఏకమొత్తంగా కొనేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ని 57 కోట్లకు, వాల్తేర్ వీరయ్యను 50 కోట్లకు డీల్ చేసుకుందనే న్యూస్ ఆల్రెడీ డిజిటల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత భారీ మొత్తంలో చిరు రెండు సినిమాలు ఒకేసారి అమ్మడం ఇదే మొదటిసారి.

ఇక్కడితో అయిపోలేదు. లారెన్స్ చంద్రముఖి 2, రణ్వీర్ సింగ్ నటించిన సర్కస్ లను కనివిని ఎరుగని క్రేజీ ఆఫర్లకు సొంతం చేసుకుంది. షారుఖ్ ఖాన్ జవాన్ ని ఏకంగా రెండు వందల యాభై కోట్లకు ఇచ్చారనే వార్త ఇతర నిర్మాతలకు కునుకు రానివ్వడం లేదు. ఇవే కాదు కన్నడ, మలయాళంలోనూ ప్యాన్ ఇండియా మూవీస్ ని ఎంత సొమ్మైనా సరే లెక్కచేయకుండా కొనేసుకుంటోంది. ప్రైమ్ కూడా తక్కువ తినలేదు. నువ్వా నేనా అనే రీతిలో ప్రొడ్యూసర్లకు గేలం వేస్తోంది. మొత్తానికి అంతర్జాతీయ సంస్థలు సైతం మన దక్షిణాది సినిమాల విలువను తెలుసుకుంటున్నాయి. మన నిర్మాతలకు అంతకన్నా కావాల్సింది ఏముంది.

This post was last modified on September 28, 2022 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రైలర్ : అరాచకం ..విధ్వంసం… ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్

https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…

1 hour ago

జైలు వరకు వెళ్లిన కస్తూరి కేసు

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…

2 hours ago

పుష్ప 3 లో యాక్ట్ చేస్తావా? : తిలక్ ఏమన్నాడంటే…

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…

5 hours ago

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు…

6 hours ago

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

9 hours ago