Trends

ఆ విష‌యంలో మ‌హిళ‌లే స్పీడ్

శృంగారం విష‌యంలో పురుషులు చాలా స్పీడ్‌గా ఉంటార‌ని, ప‌రిచ‌యం అయిన‌.. మ‌హిళ‌ల‌తో సంబంధాలు పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని చాలా మంది అనుకుంటారు. స‌మాజంలోనూ ఇదే చ‌ర్చ జ‌రుగుతుంది. కానీ.. వాస్త‌వానికి పురుషుల కంటే కూడా మ‌హిళ‌లే ఈ విష‌యంలో స్పీడ్‌గా ఉంటార‌ని.. తాజాగా ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషులు, మహిళల లైంగిక జీవనానికి సంబంధించి కీలక విషయాలు వెలువడ్డాయి. 2019-21 కాలానికి గాను 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-ఎన్ఎఫ్హెచ్ఎస్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

పలు రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళలే అధిక మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలో తేలింది. రాజస్థాన్, హరియాణా, చండీగఢ్‌, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అసోం, లక్షద్వీప్, పుదుచ్చెరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవిత కాలంలో అధికమంది సెక్స్‌ పార్టనర్లను కలిగి ఉన్నారు. రాజస్థాన్‌లో సగటున ఒక మహిళ 3.1 మందితో లైంగిక సంబంధం కలిగి ఉండగా.. పురుషుడు 1.8 మందితో ఉన్నట్లు ఆ సర్వే వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే పురుషులు, మహిళల లైంగిక భాగస్వామ్యుల సగటు అధికంగా ఉంది.

గతేడాది దేశవ్యాప్తంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3 శాతం కాగా, మహిళ జీవిత కాలంలో సెక్స్‌ పార్టనర్ల సంఖ్య 1.7గా ఉంది. అదే విధంగా గతేడాది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో సంబంధం కలిగి ఉన్న పురుషులు 1.2 శాతం కాగా, జీవిత కాలంలో 2.1 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో గతేడాది 0.4 శాతం మంది మహిళలు ఇద్దరు కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇది పురుషుల్లో 2.1శాతంగా ఉంది.

This post was last modified on August 20, 2022 1:08 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

3 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

5 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

6 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

6 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

6 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

6 hours ago