షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఇప్పుడన్న పరిస్థితుల్లో 62 ఏళ్ల వయసులో ప్రముఖ వ్యాపారవేత్త.. ఇటీవలే విమానయాన రంగంలో అడుగు పెట్టిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా తుదిశ్వాస విడిచారు. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఆయన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లుగా చెబుతున్నారు. వైద్యులు చికిత్స చేస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా చెబుతున్నారు. భారత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ గా.. ప్రముఖ ఇన్వెస్టర్ గా పేరున్న ఆయన మరణించారన్న వార్త షాకింగ్ గా మారింది.
గడిచిన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన.. ఈ ఉదయం కన్నుమూశారు. ట్రేడర్ గా.. చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయనకు ఎంతో పేరుంది. భారత సంపన్నుల్లో ఆయన ఒకరు. భారత వారెన్ బఫెట్ గా పేరున్న ఆయన తన వ్యాపార చిట్కాలతో అతి తక్కువ వ్యవధిలో భారీగా వ్రద్ధి చెందారు. ఆకాశ ఎయిర్ పేరుతో కొద్ది రోజుల క్రితమే ఎయిర్ లైన్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
గత ఏడాది ఆకాశ ఎయిర్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి.. రికార్డు సమయంలో విమానాల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఆయన.. దేశీయ విమానయాన రంగంలో మెరుపులు మెరిపిస్తారన్న మాట వినిపిస్తున్న వేళలో.. ఆయన హటాత్తుగా అందరిని విడిచి వెళ్లిపోయిన వైనం జీర్ణించుకోలేనిదిగా మారింది. ఆయనకు భార్య.. నలుగురుపిల్లలు ఉన్నారు.
ముంబయిలోని రాజస్థానీ కుటుంబంలో పెరిగిన ఆయన.. సిడెన్ హామ్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. చార్టెడ్ అకౌంటెంట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన అతి తక్కువ వ్యవధిలోనే ప్రముఖుడిగా అవతరించాడు. డిసెంబరు 2021 నాటికి ఆయన 5.8 బిలియన్ డాలర్ల ఆస్తితో భారత్ లో 48వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన హఠ్మాన్మరణం తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. ఆయన అకాల మరణం రాజకీయ నేతల్ని.. వ్యాపావేత్తల్ని షాక్ కు గురి చేస్తోంది. పలువురు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.