దేశంలో జనాభా పెరిగిపోతోంది. వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా ను దాటి భారత్ నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘2022 ప్రపంచ జనాభా అంచనాల’ నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే దేశంలో జనాభా నియంత్రణకు మోడీ సర్కారు నడుం బిగించింది. దేశంలో ఒకరు లేదా.. ఇద్దరు మాత్రమే పిల్లల్ని కనేలా.. చట్టం తీసుకువస్తున్నారు.
వాస్తవానికి ఇందిరమ్మ ప్రభుత్వ కాలం నుంచి కూడా “ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు!” నినాదంతో జనాభా నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే.. తర్వాత.. ఆడపిల్లల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ఈ నినాదాన్ని పక్కన పెట్టి.. ఆడపిల్లలను కనే తల్లిదండ్రులకు రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే కొన్ని పథకాలు కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు మరోసారి.. జనాభా పెరిగిపోతున్న పరిస్థితి తెరమీదికి వచ్చింది.
అయితే.. దీనిని నినాదాలతో కాకుండా.. చట్టంతో నియంత్రించాలనేది మోడీ సర్కారు యోచన.. ఈ క్రమంలోనే తొలిసారి దేశంలో జనాభా నియంత్రణకు బిల్లును రూపొందించారు. దీనిని ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదించుకుని.. అమలు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం.. దేశంలో ఏ కుటుంబమైనా.. ఈ ఏడాది నుంచి ఒకరు లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కనేందుకు అవకాశం ఉంటుంది. అంతకు మించితే.. ఏం చేస్తారనేది.. చూడాలి.
అయితే.. లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారత్‌లో ఇలా.. నిర్బంధ కుటుంబ నియంత్రణ సాధ్యమేనా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. కొన్ని మతాలు..కులాలను గమనిస్తే.. వారిలో కుటుంబ నియంత్రణ అనేది తప్పుగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా గిరిజనులు.. సిక్కులు, జైనులు ఇతర మతస్తుల్లో ఈ ఆచారం ఉంది. ఈ నేపథ్యంలో మోడీ తీసుకువచ్చే ఈ బిల్లు.. ఏమేరకు సక్సెస్ అవుతుంది? ఎలా ముందుకు తీసుకువెళ్తారు? అనేది చూడాలి.
This post was last modified on July 27, 2022 9:58 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…