తానా ఫౌండేషన్ ట్రస్టీలు గురువారం జున్ 30వ తేదీ జరిగిన సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి, కోశాధికారి గా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు.
తానా ఫౌండేషన్ చైర్మన్ గా ఎన్నికైన శశికాంత్ వల్లేపల్లి సుదీర్ఘకాలంగా తానాలో తానా ఫౌండేషన్ లో సేవలందిస్తూ, కాంత్ ఫౌండేషన్ స్థాపించి ద్వారా కోట్లాది రూపాయలు విరాళాలుగా అందించారు. కోవిడ్ మహమ్మారి తీవ్రతతో ఇబ్బందులు పడిన కొన్ని వేల కుటుంబాలని ఆదుకోవటానికి కోట్లాది రూపాయల స్వంత నిధులు వెచ్చించారు, తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమం కోఆర్డినేటర్ గా వెయ్యుకి పైగా విద్యార్హులకు పారితోషికాలు అందించారు. శశికాంత్ వల్లేపల్లి తానా ఫౌండేషన్ కోశాధికారిగా, కార్యదర్శిగా, బోస్టన్ తెలుగు అసోసియేషన్ బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరించారు.
తానా ఫౌండేషన్ కార్యదర్శిగా ఎన్నికైన విద్యాధర్ గారపాటి మూవర్స్ డాట్ కామ్ అధినేతగా అందరికి సుపరిచితులు, విద్యాధర్ గారపాటి వందకి పైగా ఉచిత కాన్సర్ క్యాంప్స్ కి రూపకల్పన చేసారు, తానా సంస్థ కోసం ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ ఆడిన బ్యాట్ ను 18 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి ఆ విరాళాన్ని తానాకు అందజేశారు. కొన్ని లక్షల డాలర్లు తానా సంస్థ కార్యక్రమాల కోసం వెచ్చించడమే కాకుండా ఎక్కడ తెలుగువారి మహాసభలు జరిగిన మంచినీళ్లు అందించాలనే విశాలహృదయంతో లక్షలాది వాటర్ బాటిల్స్ ని ఉచితంగా పంపిణీ చేశారు. విద్యాధర్ గారపాటి గతంలో తానా పబ్లిసిటీ కమిటి చైర్మన్ గా, న్యూ జెర్సీ న్యూయార్క్ ఏరియా రీజినల్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరించారు.
తానా ఫౌండేషన్ కోశాధికారిగా ఎన్నికైన వినయ్ మద్దినేని తానా కార్యవర్గంలో కౌన్సిలర్ ఎట్ లార్జ్ గా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షుడిగా సేవలిందించారు. అట్లాంటాలో తామా ఉచిత క్లినిక్ నిర్వహణ ఏర్పాటుకు నిర్వహణకు తీవ్రంగా శ్రమించి వేలాదిమందికి అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలబడి విశేషసేవలిందించారు.
తానా ఫౌండేషన్ నూతన నాయకత్వానికి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు శుభాకాంక్షలు తెలిపారు.
This post was last modified on July 2, 2022 5:11 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…