‘దిశ ఎన్‌కౌంట‌ర్‌’ కేసులో దోషి ఎవ‌రో తేలిపోయింది: సుప్రీం కోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో…హైకోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఎన్‌కౌంట‌ర్ కు సంబంధించి దోషి ఎవ‌రో తేలిపోయింద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసును సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ప్రభుత్వం, పిటిషనర్లు తమ వాదనలు హైకోర్టు ముందు వినిపించాలని ఆదేశించింది. సిర్పూర్కర్ కమిషన్‌ నివేదిక కాపీని ప్రభుత్వం, పిటిషనర్లు ఇరువురికి ఇస్తారని చెప్పింది. సాఫ్ట్‌ కాపీ ఇవ్వాలని కమిషన్‌ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో…హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును తాము ప్రత్యేకంగా మానిటర్‌ చేయలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేసు తదుపరి విచారణ, తీసుకునే చర్యలపై హైకోర్టే నిర్ణయిస్తుందని చెప్పింది.

హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో మాట్లాడి రావాలని తెలంగాణ న్యాయవాదులకు సీజేఐ ధర్మాసనం చెప్పింది.

దోషి ఎవ‌రో తేలిపోయింది!

సిర్పూర్‌కర్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐను లాయర్‌ శ్యామ్‌దివాన్ కోరారు. అయితే సిర్పూర్‌కర్ నివేదికలో గోప్యం ఏమి లేదని… దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.” మేం కమిషన్ వేశాం.. కమిటీ హైకోర్టుకు నివేదిక ఇస్తుంది. దానికి అనుగుణంగా ముందుకెళ్తాము” అని తెలిపారు. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని లాయర్ అన్నారు. అయితే నివేదిక ను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టొద్దని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. దేశంలో దారుణమైన పరిస్థితు లున్నాయని… ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తేలేదని సీజేఐ తేల్చి చెప్పారు. సిర్పూర్‌కర్‌ కమిషన్ రిపోర్ట్‌ను హైకోర్టుకు పంపిస్తామని సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు.