ముట్టుకుంటే అంటుకునే రోగాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. కానీ ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భయపడేలా చేసిన ఘనత మాత్రం కరోనా వైరస్‌కే దక్కుతుంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ‘సోషల్ డిస్టెన్స్’ మంత్రం జపిస్తోంది.
అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం మళ్లీ మామూలు పరిస్థితులు రావాలంటే మరో రెండేళ్లే పాటు సామాజిక దూరం పాటించాల్సిందేనట.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిన కరోనా వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వైరస్ కట్టడికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. కరోనా వైరస్‌కు ఇప్పటిదాకా వ్యాక్సిన్ లేదు. సాధ్యమైనంత త్వరగా ఈ మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు అన్నిదేశాల శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసేందుకు మరో 18 నెలల సమయం పడుతుందని అంచనా. అప్పటిదాకా ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపించే కరోనా కట్టడిని నిలువరించాలంటే సామాజిక దూరం పాటించడం ఒక్కటేదారి. కాబట్టి 2022 దాకా మనిషికి, మనిషికి మధ్య అంతరం ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు.
ఒకవేళ సోషల్ డిస్టెన్స్‌ను పక్కనబెడితే, జనాలు గుంపులు గుంపులుగా చేరడం వల్ల కరోనా మరణాల సంఖ్య ఇంతకు రెండింతలు పెరిగే ప్రమాదం ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.
అమెరికాలో ఇప్పటిదాకా 6 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 30 వేల మందికి పైగా మరణించారు. కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం, కరోనా నుంచి కోలుకున్న చైనాలో మళ్లీ కొత్త కేసులు నమోదు అవుతుండడంతో కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా రెండేళ్ల పాటు సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు.
This post was last modified on April 18, 2020 8:00 am
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…