Trends

నాటోలో ఉక్రెయిన్.. రష్యాకు ఎందుకు ఇష్టం లేదు?

ఉక్రెయిన్ మీద సైనిక చర్యను ప్రకటించింది రష్యా.  అంత వరకు విషయం ఎందుకు వెళ్లింది? అసలు ఉక్రెయిన్ -రష్యా మధ్యనున్న రచ్చేంది? రెండు దేశాల మధ్య ఎంత శత్రుత్వం ఉన్నా.. ఆధునిక ప్రపంచంలోనూ ఈ దరిద్రపు గొట్టు యుద్ధాలేంటి? మనుషుల్ని చంపుకోవటం ఏమిటి? ఆస్తుల్ని ధ్వంసం చేసుకోవడం ఏమిటి? ప్రాణం పోసే మనిషికి.. ప్రాణం తీసే హక్కు ఎవరిస్తారు? ఎందుకిస్తారు? లాంటి ఎన్నో సందేహాలు చుట్టుముడతాయి. ఇంతకూ రష్యా – ఉక్రెయిన్ మధ్య తాజా యుద్ధానికి కారణం.. నాటో. అవును.. ఆ కూటమిలోకి ఉక్రెయిన్ చేరాలనుకోవటం.. అదేమాత్రం ఇష్టం లేని రష్యా అభ్యంతరం చెప్పటం.. అయినప్పటికీ తాను నాటోలో చేరాలని డిసైడ్ అయిన ఉక్రెయిన్ ఇప్పుడా నిర్ణయానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తూ.. మూల్యం చెల్లిస్తోంది.

ఇంతకూ నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరటం రష్యాకు ఎందుకు ఇష్టం లేదు? అన్నది అసలు ప్రశ్న. అందులోకి ఉక్రెయిన్ చేరితే రష్యాకు వాటిల్లే నష్టం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. నాటో (NATO) అనే  అక్షరాలు విడదీస్తే.. ‘‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నది అర్థం. అంటే.. ఉత్తర అట్లాంటిక్ కూటమి అన్న మాట. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా.. కెనడా.. ఫ్రాన్స్.. బ్రిటన్ తో సహా పన్నెండు దేశాల సైనిక కూటమిగా దీన్ని చెప్పొచ్చు.
సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫ్యూచర్ లో ఇతర దేశాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి కొన్ని దేశాలు కలిసి ఉండాలని.. ఒక కూటమిగా ఉండి ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చి పుచ్చుకోవాలన్న ఆలోచనతో నాటోని స్థాపించాయి. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్ లో ఉంది. ఇందులో అమెరికా.. బ్రిటన్.. ఫ్రాన్స్.. ఇటలీ.. నార్వే.. నెదర్లాండ్స్.. కెనడాలు ఈ కూటమిని ఏర్పాటు చేశాయి.

ఈ కూటమిలోని దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఇందులోని ఏ దేశం మీదనైనా సరే వేరే ఏదైనా దేశం (కూటమిలో లేని దేశం).. ఏ కారణం మీదనైనా సరే సాయుధ దాడి జరిపినట్లైయితే.. కూటమిలోని దేశాలన్ని కలిసి మిగిలిన సభ్య దేశాలకు సాయం చేయాలి. అంతేకాదు.. ఈ కూటమి రెండో లక్ష్యమేమంటే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ లో నాటి సోవియట్ రష్యా విస్తరణ ముప్పునకు అడ్డుకోవటానికి కూడా దీనిని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం నాటోలో మొత్తం 30 దేశాలు ఉన్నాయి. వారు అధికారికంగా నాటో సభ్యులు. నాటోలో 27 యూరోపియన్ దేశాలు.. యూరేషియాకు చెందిన ఒక దేశం.. ఉత్తర అమెరికాకు చెందిన మరో రెండు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కూటమిగా నాటోను అభివర్ణిస్తారు. ఎందుకంటే.. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన.. శక్తివంతమైన దేశాల సముదాయమే ఈ కూటమి.

నాటో కూటమి సైనిక బలగం.. వారి వద్ద ఉండే అత్యాధునిక ఆయుధాలు.. ఇలా వారికున్న ప్లస్సులు అన్ని ఇన్ని కావు. అందుకే.. ఈ కూటమి ఏ వైపు ఉంటే.. వారిదే యుద్ధంలో విజయమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు.. ప్రపంచాన్ని ప్రభావితం చేయటంలోనూ నాటో లెక్కలు అలా ఇలా ఉండవు. స్వతహాగా నాటో కూటమి ఏర్పడిందే రష్యాకు వ్యతిరేకంగా. అలాంటి రష్యాకు అనుకొని ఉండే ఉక్రెయిన్ కానీ ఈ కూటమిలో చేరితే.. రేపొద్దున తేడా వస్తే.. నాటో కూటమి తన ముంగిట్లో ఉంటుందన్నది రష్యా ఆలోచన. అందుకే.. ఉక్రెయిన్ నాటోలో చేరతానంటే నో అంటే నో అని చెప్పటమే కాదు.. బెదిరింపులకు దిగటం.. అప్పటికి దారికి రాని ఉక్రెయిన్ ను యుద్ధంతో దార్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

This post was last modified on %s = human-readable time difference 1:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయ్ క్రేజ్.. వేరే లెవెల్

తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…

46 mins ago

ఆవేశపు ప్రశ్నకు సూర్య సూపర్ సమాధానం

కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…

2 hours ago

రేవంత్ ను దించే స్కెచ్‌లో ఉత్త‌మ్ బిజీ?

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్ట‌వ‌డం!.…

2 hours ago

కీడా కోలా దర్శకుడి ‘శాంతి’ మంత్రం

పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…

3 hours ago

చిన్న హీరోయిన్ కొట్టిన పెద్ద హిట్లు

ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…

3 hours ago

ఒకే నెలలో రాబోతున్న నాగార్జున – చైతన్య ?

తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…

4 hours ago