ఇప్పటికే టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీని విడిచిపెట్టాడు విరాట్ కోహ్లి. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కూడా పోయింది. ఐతే వన్డే కెప్టెన్‌గా గొప్ప రికార్డును కోహ్లిని ఎందుకు కెప్టెన్‌గా తప్పించారు.. ఒకవేళ తప్పదనుకుంటే కోహ్లి స్థాయి ఆటగాడిపై ఇలా వేటు వేయడం ఏంటి.. గౌరవప్రదంగా తప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా అన్నది అభిమానుల వాదన. నిజానికి కోహ్లి వన్డే కెప్టెన్సీ రికార్డు గొప్పగా ఉంది. 95 మ్యాచుల్లో అతను జట్టుకు నాయకత్వం వహిస్తే.. 65 మ్యాచుల్లో ఇండియా గెలిచింది. అతడి కెప్టెన్సీ విన్నింగ్ పర్సంటేజ్ 70.43 కావడం విశేషం.
90కి పైగా మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్లలో పాంటింగ్ (76.14 శాతం), క్రానె (73.70 శాతం) మాత్రమే కోహ్లి కంటే మెరుగైన కెప్టెన్సీ రికార్డు కలిగి ఉన్నారు. ధోని సైతం విరాట్ కంటే వెనుక ఉన్నాడు. కాకపోతే ఇప్పటిదాకా ఐసీసీ ట్రోఫీ ఒక్కటి కూడా సాధించలేకపోవడమే కోహ్లికున్న మైనస్. ఐపీఎల్‌లోనూ ఆర్సీబీ జట్టుకు ట్రోఫీ అందించలేకపోవడం అతడికి మైనస్ అయింది.
ఆ లీగ్‌లో ముంబయికి ఐదు టైటిళ్లు అందించడం, భారత జట్టుకు తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరించినపుడు ఆకట్టుకోవడం రోహిత్‌కు ప్లస్ అయింది. ఇప్పటికే టీ20లకు రోహిత్ కెప్టెన్ అయిన నేపథ్యంలో.. ఆ ఫార్మాట్‌కు అతణ్ని, వన్డేలకు కోహ్లిని కెప్టెన్‌గా పెట్టడం బాగుండదని, రెంటికీ ఒకరే సారథిగా ఉండాలని రోహిత్‌ను ఎంపిక చేశారన్నది స్పష్టం.ఐతే ఇప్పుడు చర్చ.. కోహ్లిని సెలక్టర్లు అవమానించారు అనే దాని మీదే నడుస్తోంది. కానీ ఇందులో సెలక్టర్లను తప్పుబట్టడానికేమీ లేదన్నది బీసీసీఐ వర్గాల సమాచారం. టీ20లకు ఒకరిని, వన్డేలకు ఒకరిని కెప్టెన్‌గా పెడితే బాగుండదన్న ఉద్దేశంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాలని సెలక్టర్లు కోహ్లికి సూచించారట.
ఇందుకు రెండు రోజుల గడువు కూడా ఇచ్చారట. తనంతట తనే రాజీనామా చేస్తాడని ఎదురు చూడగా.. కోహ్లి నుంచి స్పందన లేదట. దీంతో మరో మార్గం లేక అతడిపై వేటు వేసి రోహిత్‌ను కెప్టెన్‌గా ప్రకటించారట. నిజానికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటిస్తూ.. వన్డే కెప్టెన్‌ను మారుస్తున్నట్లు ప్రకటించడానికి కారణం కూడా ఇదేనట. ఈ సందర్భంగా సెలక్టర్లు కోహ్లిని తప్పిస్తున్నట్లు కూడా చెప్పలేదు. నేరుగా రోహిత్ వన్డే కెప్టెన్ అని ప్రకటన మాత్రమే చేశారు. కోహ్లి తీరు నచ్చకే ఇలా చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ పరిణామాలు చూస్తే భారత క్రికెట్లో కోహ్లి హవాకు తెరపడినట్లే కనిపిస్తోంది.
This post was last modified on December 9, 2021 2:36 pm
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74…
రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం…
గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…