దావూద్ ఇబ్రహీంకి కరోనా !!

అండర్ వరల్డ్ మాపియా డాన్ దావూద్ ఇబ్రహీంకి కరోనా సోకింది. అతనితో పాటు అతని భార్యకు కూడా కరోనా సోకడం గమనార్హం. పాకిస్తాన్ ప్రభుత్వంలోని కొందరు అధికారుల ద్వారా ఈ సమాచారం మాకు అందినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. దీంతో దావూద్ భద్రతా సిబ్బంది మొత్తం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇతను కరాచీలో ఉన్నట్లు మనకు తెలిసిన సమాచారమే.

దావూద్ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడు. ఇతని పూర్తి పేరు దావూద్ ఇబ్రహీం కష్కర్. ఇతను భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1993 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారి. ఇతనిపై ఇప్పటికే అనేక ఇంటర్ పోల్ నోటీసులు జారీ అయినా కరాచీలో తలదాచుకుంటున్నాడు. ఇతని స్థావరాన్ని పాకిస్తాన్ బయటకు వెల్లడించడం లేదు. ఇండియాతో పాటు అమెరికా కూడా ఇతనిని 2003లో గ్లోబల్ టెర్రరిస్ట్ (అంతర్జాతీయ ఉగ్రవాది)గా ప్రకటించింది.

ఇతనికి పాకిస్తాన్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే… మిలిటరీ ఆస్పత్రిలో ప్రత్యేక భద్రత మధ్య వైద్యం అందిస్తోంది. ఇతడు తన కార్యకలాపాలను డి – కంపెనీ పేరు మీద నిర్వహిస్తుంటాడు. దావూద్ భార్య మెహెజాబీన్ కూడా డి కంపెనీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటుందట. దావూద్ ని పట్టించిన వారికి 2.5 కోట్ల డాలర్లు రివార్డు ఇస్తామని అమెరికా భారత్ లు ప్రకటించినా… అతను ఇప్పటికీ దొరకడం లేదు.