నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పేదలు, మధ్య తరగతి జనాలే కాదు ఎగువమధ్య తరగతి జనాలతో పాటు ధనవంతులు కూడా ఆచితూచి కొనాల్సిన పరిస్దితులు దాపురించాయి. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్ ధర రు. 2657, కిలో పంచదార ధర 800 రూపాయలు, లీటర్ పాల ధర రు. 1195. ఇంతేసి ధరలు ఎక్కడో అనుకుంటున్నారా ? మన పొరుగునే ఉన్న శ్రీలంకలోనే. దేశాధ్యక్షుడు రాజపక్సే తీసుకన్న ఆనాలోచిత నిర్ణయం కారణంగానే నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులోకి ఎగబాకిపోయాయి.
నిత్యావసరాల ధరలు ఇంతగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే వస్తువల ధరలపై నియంత్రణను తీసేయటమే. అసలే ఆర్ధికసంక్షోభంతో నానా అవస్తలు పడుతున్న శ్రీలంకపై కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడింది. ఆహార, ఆర్ధిక సంక్షోభంపైన కరోనా విరుచుకుపడటంతో దేశంలోకి దిగుమతులన్నీ తగ్గిపోయాయి. ఎప్పుడైతే దిగుమతులు తగ్గిపోయాయో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఎప్పుడైతే శ్రీలంక నుంచి ఎగుమతులు ఆగిపోయాయో, పర్యాటక రంగం మందగించిదో వెంటనే విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం చూపింది. ఒకవైపు ఎగుమతులు ఆగిపోవటం మరోవైపు దిగుమతులు తగ్గిపోవటంతో బ్యాలెన్స్ తప్పిపోయింది. ఎప్పుడైతే దిగుమతులు కూడా తగ్గిపోయాయో దాని ప్రభావం ముందుగా దేశంలో ఉన్న నిత్యావసరాలపై పడింది. దాంతో నిత్యావసరాలకు ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోయింది. నిత్యావసరాలకు డిమాండ్ పెరిగిపోవడంతో వ్యాపారస్తులు సరుకు మార్కెట్లోకి పంపకుండా బ్లాక్ చేసేశారు.
డిమాండ్ అవసరాల మేరకు సరుకులను మార్కెట్లోకి పంపకపోవడం తో ధరలు బాగా పెరిగిపోయాయి. ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ధరలపై నియంత్రణను విధించింది. ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రకారం ధరలపై నియంత్రణ విధిస్తే ధరలు తగ్గాలి. కానీ వస్తువులు మార్కెట్లోకి రావటం మానేశాయి. అంటే మొత్తం సరుకును వ్యాపారస్తులు దాచిపెట్టేశారన్నమాట. ఫలితంగా ఆహార కొరత బాగా పెరిగిపోయింది. దీంతో జనాలు ఆహారానికి అల్లాడుతున్నారు. ఆకలి బాధల నుండి జనాలను కాపాడాలన్న ఉద్దేశ్యంతో నిత్యావసరాల పై నియంత్రణ ఎత్తేసింది.
ఎప్పుడైతే ప్రభుత్వం నియంత్రణ ఎత్తేసిందో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయి ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం ఏదో చేయబోతే ఇంకేదో అయినట్లు అర్ధమవుతోంది. మధ్య తరగతి జనాలు కూడా గోధుమపిండి, పంచధార, నూనెలను కొని వారాలు దాటిపోయాయట. కరోనా మహమ్మారి కారణంగా జనాల దగ్గర డబ్బులూ లేక, ఉన్నా కొనేందుకు నిత్యావసరాలు దొరక్క జనాలు అల్లాడిపోతున్నారు. మరి శ్రీలకంలో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates