ఇప్పుడు క్రికెట్ అంతా చాలా దూకుడుగా సాగిపోతోంది. ఆటగాళ్లు మైదానంలో, బయటా చాలా దూకుడుగానే ఉంటున్నారు. భారత క్రికెట్‌కు సంబంధించి అత్యంత దూకుడుగా కనిపించే యువ ఆటగాళ్లలో హార్దిక్ పాండ్య ఒకడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ అతడి అగ్రెషన్ ఎలా ఉంటుందో తెలిసిందే.
కాఫీ విత్ కరణ్ షోలోనే కుర్రాడి స్పీడెలాంటిదో అందరూ చూశారు. ఆ వివాదం తర్వాత మరో వ్యక్తిగత వ్యవహారంతో హార్దిక్ వార్తల్లో నిలిచాడు. సెర్బియా మోడల్ నటాషాతో అతను ప్రేమలో పడటం, కొన్ని నెలల కిందట బోట్‌లో విహరిస్తూ ఆమెకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడగడం తెలిసిందే. మరి వీళ్లిద్దరూ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతారా అని అందరూ చూస్తుంటే.. ఈ జంట పెళ్లి తర్వాత జరిగే విశేషంతో మీడియాలోకి వచ్చింది. వీళ్లిద్దరూ తల్లిదండ్రులు కాబోతుండటం విశేషం.
గర్భవతి అయిన నటాషాతో కలిసి ఫొటో దిగి అభిమానులు, మీడియాతో ఈ శుభవార్త పంచుకున్నాడు హార్దిక్. నటాషా బేబీ బంప్ చూస్తే కొన్ని నెలల కిందటే ఆమె గర్భవతి అని తేలినట్లుంది. గాయం కారణంగా దాదాపు పది నెలలుగా హార్దిక్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇక ఆటలోకి పునరాగమనం చేద్దామనుకుంటుండగా కరోనా-లాక్ డౌన్ వచ్చిపడ్డాయి.
తాను తండ్రి కాబోతున్నట్లు హార్దిక్ వెల్లడించగానే.. ఆట మానేసి ఖాళీ సమయంలో నువ్వు చేసింది ఇదా అంటూ ఫ్యాన్స్ కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. నటాషా ఈ ఏడాది చివర్లో బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది.
ఇక్కడ ఇంకో ట్విస్టు ఏంటంటే.. హార్దిక్ లాక్ డౌన్ టైంలోనే చడీచప్పుడు లేకుండా పెళ్లి కూడా చేసేసుకున్నాడట. పెళ్లి ఫొటోను కూడా అతను పంచుకున్నాడు. ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్ మెరుపులతో వెలుగులోకి వచ్చిన పాండ్య.. కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
This post was last modified on June 1, 2020 10:53 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…