కొన్ని తప్పులు చోటు చేసుకున్నంతనే వెంటనే స్పందించి.. అందుకు తగ్గ పరిహారాన్ని అందిస్తే.. ఇష్యూ అక్కడితో ముగిసిపోతుంది. అందుకు భిన్నంగా వ్యవహరించే నిర్లక్ష్యం.. అలక్ష్యం కొన్నిసార్లు కొంప ముంచుతుంది. తాజా ఉదంతాన్ని చూస్తే.. ఈ విషయం అర్థం కాక మానదు. ఒక మోడల్ కు హెయిర్ కటింగ్ చేసే విషయంలో దొర్లిన నిర్లక్ష్యానికి సదరు స్టార్ హోటల్ ఏకంగా రూ.2కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిన పరిస్థితి. 2018 ఏప్రిల్ లో జరిగిన ఈ ఉదంతంలో.. అసలేం జరిగిందంటే..
మోడల్ గా పని చేస్తున్న 42 ఏళ్ల మహిళ చెన్నైలోని ఐటీసీ మౌర్య ఫైవ్ స్టార్ హోటల్లో స్టే చేశారు. హెయిర్ కటింగ్ చేయించుకునేందుకు హోటల్లో ఉన్న సెలూన్ కు వెళ్లారు. తనకు ఇంటర్వ్యూ ఉందని.. జుట్టును కింది నుంచి నాలుగు అంగుళాల వరకు కట్ చేయాలని కోరారు. హెయిర్ డ్రెస్సర్ కటింగ్ చేస్తున్న వేళ.. కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టేసింది. డ్రెస్సర్ సూచనలకు అనుగుణంగా తల కిందకు దించి ఉండిపోయారు.
కటింగ్ పూర్తి అయిన తర్వాత చూస్తే.. కింద నుంచి కాకుండా పై నుంచి నాలుగు అంగుళాలు ఉండేలా కటింగ్ చేయటంతో ఆమె షాక్ తిన్నారు. తాను చెప్పిన దానికి.. జరిగిన దానికి సంబంధం లేకపోవడంతో ఆమె హోటల్ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కంప్లైంట్ చేయగా.. వారి నుంచి సానుకూల స్పందన రాలేదు.దీంతో ఆమె నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్ ను సంప్రదించారు. హోటల్ సిబ్బంది తన పట్ల ప్రవర్తించిన నిర్లక్ష్యం.. వారు ఉపయోగించిన రసాయనాల వల్ల తన స్కాల్ప్ పాడైందని కోర్టుకు తెలిపారు.
తనకు పొడవైన జట్టు ఉండటం వల్ల ప్రముఖ పెంనీలు షాంపూ యాడ్ లో నటించానని.. హోటల్ లో జరిగిన దానికి తాను ఆ ఛాన్సును మిస్ అయినట్లుగా పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనల్ని విన్న కోర్టు.. ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బందిది తప్పని తేల్చింది. ఇందుకు పరిహారంగా రూ.2 కోట్ల మొత్తాన్ని బాధిత మహిళకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదంతం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మీకు ఎక్కడైనా సేవా లోపం జరిగితే.. న్యాయం కోసం పోరాడితే.. అంతో ఇంతో ఫలితం రావటం ఖాయమని చెప్పక తప్పదు.
This post was last modified on September 24, 2021 10:47 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…