కెప్టెన్సీ వదలుకుంటున్న కోహ్లీ..? బీసీసీఐ ఏమందంటే..!

టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన కెప్టెన్సీ వదులుకుంటున్నాడా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. మిప్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత.. కోహ్లీ ఆ బాధ్యతలను స్వీకరించాడు. అయితే.. ఇప్పుడు.. కోహ్లీ నుంచి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు చెబుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వార్త విని.. కోహ్లీ అభిమానులు చాలా కలవరపడుతున్నారు.. త్వ‌ర‌లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ త‌ర్వాత కెప్టెన్సీ మార్పు ఉండ‌బోతున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతుంది. ప్ర‌స్తుతం టెస్ట్, వ‌న్డే, టీ20లకు కోహ్లీయే కెప్టెన్ కాగా… రోహిత్ శ‌ర్మ వైఎస్ కెప్టెన్ గా ఉన్నారు.

వ‌న్డేల్లో మంచి ట్రాక్ రికార్డు కూడా ఉన్న రోహిత్ కు వ‌న్డేల‌తో పాటు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్య‌తలు అప్ప‌గించ‌బోతున్న‌ారంటూ ప్రచారం ఊపందుకుంది. కాగా.. ఈ వార్తలు విపరీతంగా వస్తుండటంతో.. దీనిపై ఏకంగా బీసీసీఐ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని క్లారిటీ ఇచ్చింది. జాతీయ మీడియాలో ఈ విషయమై వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని క్లారిటీ ఇవ్వడం విశేషం. కాగా.. బీసీసీఐ క్లారిటీ తర్వాత.. కోహ్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.