క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న రోజు రానేవచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు మినీ ప్రపంచకప్ దుబాయిలో జరగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా 4 స్థానాల కోసం మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అందులో నాలుగు జట్లకు వరల్డ్ కప్ ఛాన్స్ లభిస్తుంది.
రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్ మరియు పపువా – న్యూగినియాల మధ్య మ్యాచ్‌తో అక్టోబర్ 17న ఈ మెగా ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్కాట్లాండ్- బంగ్లాదేశ్ జట్ల మధ్య మరో మ్యాచ్ షెడ్యూల్ చేశారు. రౌండ్ 1లో భాగంగా గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నబీబియా జట్లు ఉన్నాయి.
గ్రూప్ – బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్‌నకు అర్హత సాధిస్తాయి. రౌండ్ 2లో భాగంగా అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates