టోక్యో ఒలంపిక్స్ లో పతకం సాధించి తిరిగి వస్తే.. నీతో కలిసి ఐస్ క్రీమ్ తింటాను అంటూ.. ప్రధాని మోదీ.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ మాటను ఆయన తాజాగా నిలపెట్టుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లతో తాజాగా ప్రధాని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి అల్పాహార విందు ఇచ్చారు. ఇదే సమయంలో టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన పీవీ సింధుతో కలిసి ప్రధాని మోదీ ఐస్ క్రీం తిన్నారు. ఆమెతో కాసేపు మాట్లాడారు
టోక్యో బ్యాడ్మింటన్‌లో గెలుచుకున్న బ్రాంజ్‌తో పాటు.. గతంలో రియో ఒలింపిక్స్‌లో సాధించిన పతకాన్ని కూడా ఈ సందర్భంగా సింధు తన వెంట తీసుకెళ్లింది. ఆ రెండింటిని ధరించి.. ప్రధాని మోదీతో కలిసి ఆమె ఫోటో దిగింది.
ఇక జావెలిన్ త్రోలో.. అదరగొట్టి.. దేశానికి స్వర్ణం కల తీర్చిన నీరజ్ చోప్రాతో కొద్దిసేపు మోదీ ముచ్చటించారు. అనంతరం అతనితో కలిసి ఫోటో దిగారు. తనకు చూర్మ వంటకమంటే ఇష్టమని నీరజ్ చెప్పడంతో.. దాన్ని సిద్ధం చేయించారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.