ఇండియాలో కరోనా కేసులు 6000 మార్కు దాటింది. కాకపోతే గత 24 గంటల్లో కొత్త కేసుల పురోగతిలో కొంచెం మందగమనం కనిపించడం ఆశావహం. కరోనా లక్షణాలు బయటపడే 14 రోజుల సమయం కూడా లాక్ డౌన్ పెట్టాక దాటేశాం. అయినా కేసుల సంఖ్య తక్కువగానే నమోదు కావడం ఆశను పెంచింది.
ఇప్పటివరకు దేశంలో లక్ష 30 వేల టెస్టులు చేయగా 6000 మందికి ఇది సోకినట్లు నిర్దారణ అయ్యింది. నిన్నటికి 700 పైగా పెరిగిన కేసులు నేడు 591 వద్ద నమోదయ్యాయి.
ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 5865 గా ఉంది. ఇది డిశ్చార్జి అయిన 478 మందితో కలిపి వేసిన సంఖ్య. మరో 169 మంది మరణించారు. మరణించిన వారితో కలుపుకుంటే ఇండియా 6 వేల మార్క్ దాటినట్టు.
ఇక తెలంగాణలో కొత్తగా 18 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 471 కి పెరిగింది. రేపటి నుంచి కొత్త కేసులు ఉండకపోవచ్చని మంత్రి ఈటల చాలా దీమాగా చెప్పారు. ఇప్పటికే తబ్లిగి కి వెళ్లొచ్చిన వారందరికీ టెస్టులు పూర్తవడం వల్ల గవర్నమెంటు కాన్ఫిడెన్సుతో ఉంది. కొత్త మరణం ఒకటి నమోదైంది. ఈటల ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఏప్రిల్ 22 నాటికి మొత్తం అందరూ కోలుకుంటారని చెప్పారు.
ఏపీలో ఉదయం ప్రకటించిన బులిటెన్లో 217 శాంపిల్స్ చెక్ చేసినా ఒక్క కొత్త కేసు కూడా లేదని గుడ్ న్యూస్ చెప్పింది. కానీ సాయంత్రం బులిటెన్ లో కొత్తగా 15 కేసులు నమోదైనట్టు ఏపీ ప్రకటించింది. వీటిలో ప్రకాశం జిల్లాలో 11 గుంటూరులో 2, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఓవరాల్ తెలుగు రాష్ట్రాల్లో గాని, దేశంలో గాని కరోనా తీవ్రత కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కాకపోతే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లో మాత్రం కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి.
This post was last modified on April 9, 2020 6:57 pm
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర విన్నపం చేశారు. తరచుగా కేం ద్రంపై…
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మోస్ట్ సర్ప్రైజింగ్, ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అంటే బుల్లిరాజు అనే పాత్రలో రేవంత్ అనే చిన్న కుర్రాడు…
గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ…
ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు…