41ఏళ్ల తర్వాత.. హాకీలో భారత్ కి పతకం..!

భారత్ 41ఏళ్ల కల నెరవేరింది. టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. ఈ పతకం కోసం భారత్ దాదాపు 41ఏళ్ల నుంచి ఎదురుచూస్తుండటం గమనార్హం.

సెమీస్‌లో ఓడిన హాకీ జట్టు.. కాంస్య కోసం జరిగిన పోరులో మాత్రం అదరొట్టింది. జర్మనీపై 4-5 తేడాతో విజయం సాధించింది. మొదట జర్మనీ జట్టు దూకుడు ప్రదర్శిస్తూ.. భారత్‌పై ఆధిపత్యం సాధిస్తున్నట్లు కనిపించింది. తొలి గోల్ జర్మనీయే సాధించింది. ఆ తర్వాత భారత ఆటగాడు సమర్ జిత్ గోల్ కొట్టి సమం చేశాడు.

అనంతరం జర్మనీ జట్టు వరుసగా రెండు గోల్స్ సాధించడంతో 3-1 తేడాతో ఇండియన్ టీమ్ వెనకబడిపోయింది. ఐతే ఆ తర్వాత మనోళ్లు చెలరేగిపోయారు. వరుసగా నాలుగు గోల్స్ కొట్టారు. హార్ధిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సమర్ జిత్ సింగ్ గోల్ కొట్టడంతో 3-5 లీడింగ్‌లోకి వెళ్లిపోయింది భారత్. అనంతరం జర్మనీ మరో గోల్ కొట్టినా.. 4-5 తేడాతో ఇండియా గెలిచింది.

మొదటి క్వార్టర్ ముగిసే సరికి జర్మనీ 1-0 లీడింగ్‌లో ఉంది. రెండో క్వార్టర్‌లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. జర్మనీ మరో 2 గోల్స్, భారత్ మూడు గోల్స్ సాధించడంతో 3-3తో స్కోర్లు సమయం అయ్యాయి. మూడో క్వార్టర్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు గోల్స్ సాధించి 3-5 లీడింగ్‌లోకి వెళ్లిపోయింది. ఐతే నాలుగో క్వార్టర్‌లో జర్మనీ ఒక గోల్ సాధించడంతో భారత్ లీడింగ్ కాస్త తగ్గింది. ఐనా 4-5 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమర్ జిత్ రెండు గోల్స్ సాధించి భాారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.