లంచాలు తీసుకొని ఆస్తులు కూడపెట్టిన అధికారులను మీరు చాలా మందినే చూసుంటారు. కానీ.. ఇప్పుడు చెప్పే అధికారి మాత్రం.. లంచగుండులకే తాత. ఆయన లంచం తీసుకొని ఎంత సంపాదించాడు అనే విషయం.. కేవలం ఆయన ఇళ్లు చూస్తే సరిపోతుంది. ఆ ఇల్లు చూసి ఉన్నతాధికారులకే కళ్లు తిరిగిపోయాయి. ఇంట్లోని ఇంటరీయర్ దగ్గర నుంచి టాయ్ లెట్ వరకు మొత్తం బంగారంతోనే చేయించాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నైరుతి రష్యాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్‌లో ఓ అందమైన భవంతి ఉంది. ఇది కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారిది. ఆ ఇంటికి సోదాలు వెళ్ళినప్పుడు… అవాక్కవ్వడం అధికారుల వంతైంది. ఆ ఇంట్లో అన్ని బంగారంతో చేసినవవ్వడంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. బెడ్రూమ్, హాలే కాదు..కిచెన్, మరుగుదొడ్డి కూడా బంగారంతో కట్టించుకోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతేకాకుండా ఫర్నీచర్, గోడకుండే ఫ్రేమ్‌లు, కుర్చీలు, కిచెన్‌లో ఉండే అలమరాలు..అంతా పుత్తడిమయమే. చివరాకరకు ఇంటరీయర్ డెకరేషన్ కూడా బంగారంతో ధగధగలాడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అధికారులు అప్‌లోడ్ చేశారు. 50 సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియో ..నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ బడా కుంభకోణంలో 35 మందికిపైగా ట్రాఫిక్ పోలీసులు భాగమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం.. అలెక్సీ, అతని కింద ఉండే ఉండే కొంత మంది అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని వాహనాలకు ఫేక్ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయా వాహనాలు స్టావ్రోపోల్‌లో ఎలాంటి రుసుము చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలోనే వారు భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. అదే కేసులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ కోసం వెళ్లిన పోలీసులు.. ఆ ఇంటిని చూసి షాకయ్యారు. ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలు శిక్ష పడుతుందని స్థానిక మీడియోలో కథనాలు వెలువడ్డాయి.
This post was last modified on July 27, 2021 11:42 am
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…