శ్రీలకంలో టీమిండియా కుర్రాళ్లు అదరగొడుతున్నారు. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఈ జట్టు.. 3 మ్యాచుల వన్డే సిరీస్ ను ఇప్పటికే 2-0 తో గెలిచేశారు. మరోవైపు మరో టీమ్ ని ఇంగ్లాండ్ కి బీసీసీఐ పంపించింది. ఈ క్రమంలో.. టీమిండియా 41ఏళ్ల నాటి రికార్డును రిపీట్ చేసింది.
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్‌కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగురు కొత్త ప్లేయర్స్‌ను తీసుకుంది. సంజు శాంసన్‌తోపాటు నితీష్ రాణా, కే గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చహర్‌లు తమ తొలి వన్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయర్స్ ఇండియా తరఫున అరంగేట్రం చేయడం ఇది రెండోసారి మాత్రమే.
తొలిసారి 1980లో ఇలా ఒకే వన్డేలో ఐదుగురు కొత్త వాళ్లకు అవకాశమిచ్చిన ఇండియన్ టీమ్.. మళ్లీ 41 ఏళ్ల తర్వాత దానిని రిపీట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 66 పరుగులతో టీమిండియా విజయం సాధించడం విశేషం. ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్‌లో భారీ మార్పులు చేసింది టీమిండియా. ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యజువేంద్ర చహల్, కుల్‌దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చింది.
This post was last modified on July 23, 2021 6:09 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…