లవర్ బ్రేకప్ చెప్పిందని.. దేవదాసుల్లా మారిన వారిని చాలా మందినే చూసి ఉంటారు. లేదంటే.. మాజీ ప్రియురాలిపై పగ పెంచుకొని.. ఆమెను ఇబ్బంది పెట్టినవారు కూడా ఉండే ఉంటారు. ఇంకొందరు ఆ బాధ తట్టుకోలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. తాను ప్రేమలో విఫలమైన బాధ తట్టుకోలేక.. తనకు ఎలాంటి సంబంధం లేని 15కారుల ధ్వసం చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.
గురువారం రాత్రి వరకు బాగానే ఉన్న తమ కార్లు శుక్రవారం ఉదయం లేచేసరికి ధ్వంసమై కనిపించడంతో ఆ వాహనాల యజమానులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు.
ఈ నేపథ్యంలో ఓ యువకుడు కార్లను రాడ్డుతో ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ప్రియురాలితో బ్రేకప్ కారణంగా తీవ్ర కుంగుబాటు, మనస్తాపానికి గురై.. ఈ పనిచేసినట్లు సదరు యువకుడు విచారణలో పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
This post was last modified on July 17, 2021 10:48 am
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…