Political News

విజయ్ పార్టీ తరుపున త్రిష పోటీ?

తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ అతడికి కఠిన సవాళ్లే ఎదురవుతున్నాయి. గత ఏడాది కరూర్ తొక్కిసలాట విషాదం విజయ్‌ను ఆత్మరక్షణలోకి నెట్టింది. దాన్నుంచి కోలుకుని కాస్త ముందడుగు వేసేలోపు వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారి.. మళ్లీ డిఫెన్స్‌లో పడిపోయాడు విజయ్.

త్రిషతో అక్రమ సంబంధం గురించి ఆరోపణలు వస్తున్న సమయంలో ఎన్నికలు అయ్యేవరకు మౌనం వహించాల్సింది పోయి.. ఆమెతో కలిసి ఒక పెళ్లి వేడుకలో పాల్గొనడం ద్వారా ఆరోపణలు నిజమే అని అందరికీ స్పష్టతనిచ్చాడు విజయ్. దీంతో విజయ్ రాజకీయ ప్రత్యర్థులకు బలమైన ఆయుధం దొరికింది. విజయ్‌తో పాటు త్రిషనూ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. సామాన్య జనం కూడా ఈ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి త్రిష విషయంలో విజయ్ ఏదో సంకేతం ఇవ్వబోతే.. అది కాస్తా బూమరాంగ్ అయింది.

ప్రస్తుత పరిస్థితుల్లో త్రిషకు విజయ్ ఎంత దూరం జరిగితే అంత మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. ఆయన ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తమిళనాట చర్చ జరుగుతోంది. త్రిషను తన పార్టీ తరఫున ఎన్నికల బరిలోనూ దింపాలని విజయ్ చూస్తున్నాడని కొత్త పుకారు మొదలయ్యింది.

ఈ విషయంలో త్రిషనే ఎక్కువ ఆసక్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉన్నట్లు త్రిష ఎప్పుడో చెప్పింది. మీ జీవిత లక్ష్యమేంటి అని అడిగితే.. సీఎం కావడం అని చెప్పింది. బహుశా జయలలిత ఆమెకు స్ఫూర్తి ఏమో. జయలలిత.. ఎంజీఆర్‌‌కు సన్నిహితురాలిగా ఉంటూ అన్నాడీఎంకే పార్టీలో ఎదిగారు. ఎంజీఆర్ మరణానంతరం కఠిన సవాళ్లను ఎదుర్కొని సీఎం కూడా అయ్యారు.

ఇప్పుడు విజయ్, త్రిష వ్యవహారం చూస్తుంటే.. ఎంజీఆర్, జయలలితల బంధం గుర్తుకు వస్తోంది. త్రిషకు రాజకీయాల్లో వచ్చి, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఉండబట్టే.. ఆమెతో కలిసి విజయ్ బయటికి వచ్చాడని.. నేరుగా ఆమెను ఎన్నికల బరిలో నిలిపితే విమర్శలు వస్తాయి కాబట్టి ముందే జనాలను ప్రిపేర్ చేయడానికి ఇలా చేశారని రాజకీయ విశ్లేషకులు సూత్రీకరిస్తున్నారు. త్రిష ఎన్నికల పోటీ గురించి త్వరలో టీవీకే పార్టీ తరఫున ప్రకటన వస్తే ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి అదే జరిగితే జనం ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on March 14, 2026 7:01 am

Share

Recent Posts

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

22 minutes ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

3 hours ago