Movie News

ప్యారడైజ్ లోపల ఇంత ప్లానింగా?

కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన ఇమేజ్ మారిపోయింది. తాను ఊర మాస్, రగ్డ్ క్యారెక్టర్లు కూడా చేయగలనని ఆ సినిమాతో రుజువు చేసిన నాని.. గత ఏడాది ‘హిట్-3’లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూనే వీర లెవెల్లో వయొలెన్స్ పండించాడు. ఇప్పుడు అతను నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ నుంచే ఇది వేరే లెవెల్ సినిమా అనే సంకేతాలు వచ్చేశాయి. ఆ తర్వాత సినిమా నుంచి రిలీజ్ చేస్తున్న ప్రతి ప్రోమో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది. ఈ మధ్యే రిలీజ్ చేసిన ‘ఆయా షేర్’ పాట అయితే మామూలు కిక్కు ఇవ్వలేదు ప్రేక్షకులకు. టాప్ స్టార్లు నటించే.. వందల కోట్ల బడ్జెట్లు పెట్టి తీసే సినిమాల్లో కనిపించే భారీ తనం, విజువల్ క్వాలిటీ అందులో కనిపించాయి. ఆ పాట కంపోజింగ్, సింగింగ్, టేకింగ్, సెట్టింగ్స్, డ్యాన్సులు.. అన్నీ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి.

నాని స్థాయికి మించి రూ.200 కోట్ల దాకా ‘ది ప్యారడైజ్’ మీద పెట్టుబడి పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ముందు అంత అవసరమా అన్న ప్రశ్నలు వినిపించాయి. కానీ పాట క్వాలిటీ చూశాక అందరి నోళ్లూ మూతపడ్డాయి. డబ్బులు పెట్టినంత మాత్రాన ఆ క్వాలిటీ, ఆ విజువల్స్ రావు. దాని వెనుక ఎంతో తపన, కష్టం ఉన్నాయి.

సినిమాలో నాని చేసిన జడల్ ఒక తెగకు నాయకుడిగా ఎదుగుతాడు. ఆ తెగ ఉండే ఊరిని రెండున్నర ఎకరాల స్థలం తీసుకుని మొత్తం సెట్టింగ్స్ ద్వారా క్రియేట్ చేశారు. నెల రోజుల పాటు 50 మంది శ్రమించి ఊరిలో 60 ఇళ్ల నిర్మాణాలతో సెట్‌ను తీర్చిదిద్దారు. 500 మంది నివాసముండగలిగే స్థాయిలో రియలిస్టిగ్గా ఈ సెట్స్‌ను తీర్చిదిద్దారట.

ఇందులో నాని ఇంటిని కూడా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కథ ప్రకారం విచిత్రమైన వేషధారణ, అలవాట్లు, కల్చర్ ఉన్న తెగ నేపథ్యంలో కథ నడుస్తుంది. అందుకు తగ్గట్లుగా వింటేజ్ స్టయిల్లో ఇప్పటిదాకా ఏ సినిమాలో చూడని శైలిలో సెట్లు వేశారు. అక్కడుండే ప్రాపర్టీస్ అన్నీ కూడా భిన్నమైనవే.

ఇక్కడ వంద ట్యాంకుల నీళ్లు తెచ్చి ఒక చిన్న కుంటను కూడా ఏర్పాటు చేశారు. ఇలా ‘ది ప్యారడైజ్’లో వరల్డ్ క్రియేషన్ వెనుక చాలా కసరత్తే ఉంది. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆ సెట్ల తాలూకు ఫొటోలు చూస్తే.. నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి అండ్ టీమ్ కలిసి చాలా పెద్ద ప్లానింగ్‌తోనే అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

This post was last modified on March 14, 2026 7:11 am

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

3 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

4 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

4 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

5 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

7 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

8 hours ago