Movie News

ఊపిరి పీల్చుకుంటున్న పెద్ద సినిమాలు

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కావాలంటే తొంబై రోజుల ముందే అప్లై చేసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిన్న సుప్రీమ్ కోర్టు నిలువరించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఎక్కడ లేని సంతోషాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రతిసారి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరో ఒకరు కేసులు వేయడం, మంత్రులు సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావడం, ప్రొడ్యూసర్లు లాయర్ల చుట్టూ తిరగడం గత ఆరేడు నెలల నుంచి జరుగుతోంది.

ఇప్పుడు టెన్షన్ లేదు. నైజామ్ లో ఉస్తాద్ బెనిఫిట్ షోలు పడతాయి. టికెట్ హైక్స్ కోసం రెగ్యులర్ పద్ధతి లోనే విన్నపం చేసుకోవచ్చు. అనుమతులు కూడా వస్తాయి. కాకపోతే ఆల్రెడీ గరిష్టంగా 295 రూపాయలు ఉన్న మల్టీప్లెక్స్ ధరను ఇంకా పెంచుకుంటారా అనేది వేచి చూడాలి. ఏపీలో ఎలాంటి ఇబ్బంది లేదు. అడగటం ఆలస్యం పర్మిషన్లు వస్తున్నాయి. పవన్ మూవీకి పది రోజుల పాటు స్పెషల్ రేట్ల మీద షోలు వేసుకునేందుకు అఫీషియల్ ముద్ర పడిపోయింది.

ఈ ఏడాది చాలా ప్యాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి. పెద్ది, ప్యారడైజ్, విశ్వంభర, ఫౌజీ, ఎన్టీఆర్ – నీల్, బాలయ్య 111, స్వయంభు, నాగబంధం, టాక్సిక్ ఇలా పెద్ద క్యూ ఉంది. వీటిలో అన్నింటికి పెంపు అడుగుతారని చెప్పలేం కానీ టయర్ 1 హీరోల బడ్జెట్ లు రికవర్ కావాలంటే మాత్రం తప్పదు. అయితే ఇక్కడితో టెన్షన్ అయిపోయిందని చెప్పడానికి లేదు. ఏదైనా కొత్త మెలికతో మళ్ళీ ఎవరైనా ఈ ఇష్యూ మీద న్యాయస్థానం మెట్లు ఎక్కితే ఇబ్బందులు తప్పవు.

ప్రస్తుతానికి ఒక పెద్ద గందరగోళానికి తెరపడింది. అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి కమర్షియల్ మూవీతో బోణీ జరగడం శుభ పరిణామం. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సునామి ఓ రేంజ్ లో ఉంటుంద్. దురంధర్ రివెంజ్ తో పోటీ ఉన్నప్పటికీ పవన్ అభిమానులు ఆందోళన చెందడం లేదు. ఓజి టాక్ వచ్చినా చాలు ఉస్తాద్ సేఫ్ గా బ్లాక్ బస్టర్ అయిపోతుందని నమ్మకం పెట్టుకున్నారు. ట్రైలర్ చూశాక దీని మీద ఒక అంచనాకు రావొచ్చు.

This post was last modified on March 14, 2026 10:34 am

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

16 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

3 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

9 hours ago