కండలు తిరిగిన శరీరం.. పోత పోసిన గ్రీకు శిల్పంలా ఉన్న అతడ్ని చూస్తే మగాళ్లు సైతం ఈర్ష పడతారు. ఇక.. అమ్మాయిల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి కండల వీరుడు కాస్తా.. బక్కచిక్కిపోయిన వైనం చూస్తే షాక్ తినాల్సిందే. అతడు.. ఇతడు ఒకరేనా? ఏమైనా తేడా చేస్తున్నారా? పక్కదారి పట్టిస్తున్నారా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. రెండు ఫోటోల్లోని వ్యక్తులు ఒకరే. కాకుంటే.. కరోనాకు ముందు.. కరోనా తర్వాత అన్నదే తేడా. కరోనా ఏముంది? లైట్ తీసుకోవచ్చని పొరపడితే అంతకు మించిన తప్పు మరొకటి ఉండదు.
ఎంతటివాడినైనా కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే కరోనా మాయదారి.. దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. వారి ప్రాణాల మీదకు తీసుకురావటం ఖాయం. అందుకే.. చిన్నపామును సైతం పెద్ద కర్రతో కొట్టాలన్న రూల్ ను కరోనా వేళ అస్సలు మర్చిపోకూడదు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక బాడీ బిల్డర్.. కరోనా బారిన పడి.. మృత్యుముఖం వరకు వెళ్లి వచ్చిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. మల్కాజిగిరికి చెందిన 32 ఏళ్ల సునీల్ కుమార్ గైక్వాడ్ తెలంగాణ రాష్ట్రం తరఫున బాడీ బిల్డింగ్ క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బాడీ బిల్డింగ్ ప్రదర్శనలో అతగాడిని చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. అలాంటి స్ట్రక్చర్ ఉన్న అతడికి ఏప్రిల్ చివరి వారంలో కరోనా బారిన పడ్డారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేరిన అతడికి ఒకదశలో శ్వాస తీసుకోవటం కష్టంగా మారింది. ఇలాంటి వేళలో అపద్భాందవుడిగా మారిన నటుడు సోనూసూద్ ను సాయం కోరారు. వెంటనే స్పందించిన ఆయన.. సుశీల్ ను నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు.
అప్పటికే బాధితుడి ఊపిరితిత్తులు దాదాపు 80 శాతం ఇన్ ఫెక్షన్ కు గురైనట్లు గుర్తించారు. దీంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్న వైద్యులు అతడికి ప్రత్యేక వైద్య సాయాన్ని అందించారు. దీనికి తోడు సుశీల్ పట్టుదల.. కరోనాను జయించాలన్న అతడి సంకల్పం అతడ్నిమరణం నుంచి బయటపడేలా చేసింది. కాకుంటే.. గతంలో వంద కేజీలు ఉండే సుశీల్ ఇప్పుడు 72 కేజీలకు తగ్గిపోయాడు. ఈ ఉదంతాన్నిచూస్తే.. కరోనాకు ఎవరూ అతీతం కాదనే విషయం స్పష్టం కావటమే కాదు.. మహమ్మారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలే తప్పించి నిర్లక్ష్యం అస్సలు వద్దన్న మాటలో నిజమెంతో ఇట్టే అర్థమైపోతుంది.
This post was last modified on June 21, 2021 10:39 am
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…