ఇండియాలోకరోనా వైరస్ కి సీన్ వుందా, లేదా?

కరోనా వైరస్ ఉష్ణ వాతావరణంలో జీవించలేదు, అందుకని ఇండియన్స్ కి ఏం కాదు అంటూ వైరస్ ఇండియాలోకి రాకముందు నుంచీ వాట్సాప్ సైంటిస్టులు ప్రచారం చేస్తూ వచ్చారు. వైరస్ వచ్చేసింది అన్నా కానీ మనకేమీ కాదనే మొండి ధీమా మనలో చాలామంది చూపించారు. అయితే ఇందులో కొంత నిజం లేకపోలేదు. శీతల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణ ప్రాంతాలలో ఈ వైరస్ వ్యాప్తి మందకొడిగా ఉంది.

కేవలం ఇండియాలో అనే కాదు, మిగతా వేడి ప్రాంతాలయిన ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో కూడా వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే ఉంది. ఇండియాలో వైరస్ ఎంటర్ అయినా సమయం తీసుకుంటే దాదాపుగా ఇటలీ, అమెరికాతో సమానంగానే ఉంటుంది.

కానీ అక్కడి మాదిరిగా ఇక్కడ వ్యాప్తి చెందలేదు, అలాగే అన్ని మరణాలు కూడా సంభవించలేదు. అలా అని ఇక్కడ వైరస్ జీవించలేదు అనడానికి లేదు. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తే ఈ వైరస్ ప్రభావం అలాగే ఉంది. అందుకే మర్కజ్ కి వెళ్లి వచ్చిన వారిలో అంతమందికి ప్రాణాలు పోయాయి.

కాకపోతే ఉపరితలాలపై ఈ వైరస్ ఎక్కువ సమయం ఉండడం లేదని మాత్రం సంకేతాలు అందుతున్నాయి. అదీ కాక మన ప్రభుత్వం ముందే లాక్ డౌన్ ప్రకటించడం కూడా వ్యాప్తిని తగ్గించింది. ఏదేమైనా వైరస్ ని తేలికగా అయితే తీసుకోరాదు. మరో నాలుగు వారాల పాటు అయినా మనం లాక్ డౌన్ లో ఉన్నట్టయితే వైరస్ వ్యాప్తిని పూర్తిగా అదుపు చేయవచ్చు.