ఆయనది అతిపెద్ద కుటుంబం. 38 మంది భార్యలు, 89 మంది పిల్లలతో ప్రపంచంలోనే అతిపెద్ద కుటంబానికి యజమానికిగా రికార్డులెక్కారు. ఆయనే జియోనా చానా. కాగా.. 38 భార్యల ఈ ముద్దుల భర్త ప్రాణాలు కోల్పోయారు.
మిజోరాం రాష్ట్రానికి చెందిన జియోనా చానా.. ఆనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇటీవలే 76 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన.. షుగర్, బీపీ సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఐజ్వాల్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు.
సెర్చిప్ జిల్లాలోని బక్తాంగ్ త్లాంగునూమ్ గ్రామంలో తన 181 మంది కుటుంబ సభ్యులతో ( మనుమలు, మనవరాళ్లు కలిసి)తో నివసించేవాడు జియోనా చానా. కేవలం ఆయన కుటుంబాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేశారు. దీంతో ఆగ్రామం ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా మారింది. జియోనా చానా మరణంపై మిజోరాం ముఖ్యమంత్రి జోరంతాంగ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.