ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లకు ఊహించని షాక్ ఎదురైంది. ఈ రెండు సంస్థలకు రష్యా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. నిషేదిత కంటెంట్ ని తొలగించడంలో.. విఫలమైన కారణంగా వీటికి జరిమానా విధించడం గమనార్హం.
ఫేస్ బుకి 17మిలియన్ రబెల్స్( 2.36లక్షల డాలర్లు), టెలిగ్రామ్ 10 మిలియన్ రబెల్స్(1.39లక్షల డాలర్లు) చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సోషల్ మీడియా సంస్థలకు జరిమానా విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించని నేపథ్యంలో.. గత నెల కూడా ఈ రెండు సంస్థలకు భారీగానే ఫైన్ పడింది. గత నెల ఫేస్ బుక్ కి 26 మిలియన్స్ రబెల్స్, టెలిగ్రామ్ కి 5 మిలియన్ రబెల్స్ ఫైన్ విధించారు.
కాగా.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ఆందోళనకారులు వీదుల్లో నిరననలు చేపట్టారు. అయితే.. దీనికి సోషల్ మీడియా సంస్థలే కారణమంటూ అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఈ సోషల్ మీడియా వెబ్ సైట్లపై నియంత్రణ పెంచాలని భావించిన రష్యా ప్రభుత్వం.. ట్విట్టర్ పై నిషేధం విధించాలని కూడా భావించింది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చట్టవిరుద్ధంగా ఉన్న కంటెంట్ తొలగించలేదని ఫేస్ బుక్, టెలిగ్రామ్ లకు జరిమానాలు విధించింది.
This post was last modified on June 11, 2021 4:17 pm
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్‌ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్‌కు…