యువతితో ఫుడ్ డెలివరీ బాయ్ అసభ్య ప్రవర్తన..!

యువతితో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా… నిందితుడిని కేవలం 48గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ ఇండియాకు చెందిన ఓ యువతి బెంగళూరులో నివసిస్తోంది. కాగా.. మే 31వ రాత్రి ఓ ఫుడ్ డెలివరీ బాయ్.. సదరు యువతి పట్ల నీచంగా ప్రవర్తించాడు. వెనక నుంచి యువతిని అసభ్యంగా తాకాడు. ఈ ఘటనతో భయపడిపోయిన యువతి.. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని 48గంటల్లో పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు అరుణ్ కుమార్, అతని సోదరుడు బెంగళూరులోని ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ వీరిద్దరు సోదరులు ఫుడ్ డెలివరీ చేశారు.

నిందితుడు అరుణ్ రాత్రి సమయంలో ఫుడ్ డెలివరీ చేయగా.. అతని సోదరుడు ఉదయం పూట ఫుడ్ డెలివరీ చేసేవాడు. ఈ క్రమంలో.. అరుణ్ కుమార్.. గత నెల మే 31వ తేదీ రాత్రి ఫుడ్ డెలివరీ చేయడానికి వెళుతూ.. ఓ యువతిని అసభ్యంగా తాకాడు.

ఘటనతో భయపడిన యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. వారు 40 సీసీ కెమేరాల ఆధారంగా దాదాపు 80 బైకులను పరిశీలించారు. కాగా.. నిందితుడు గేర్ లేని స్కూటర్ వినియోగిస్తున్నాడని గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా ముందు నిందితుడు సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేరం చేసింది అరుణ్ కుమార్ గా గుర్తించారు. కాగా.. నిందితుడు.. గతంలో మరో ముగ్గురు, నలుగురు యువతులతో ఇదే విదంగా ప్రవర్తిచినట్లు తేలడం గమనార్హం.