ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అస్సలు బాలేదు. కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో పరీక్షలు పెడితే.. విద్యార్థులు ఆ మహమ్మారి బారినపడే ప్రమాదం ఉందని.. ఏకంగా పరీక్షలు కూడా రద్దు చేశారు. గతేడాది సైతం పరీక్షలు నిర్వహించలేదు. ఇక క్లాసులు సైతం ఆన్ లైన్ లోనే నిర్వహించారు. తాజాగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ.. ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్త విని చాలా మంది విద్యార్థులు ఎగిరి గంతేసి ఉంటారు. పరీక్ష రాయకుండా పాస్ అవ్వడం అంటే చాలా మందికి నచ్చే విషయమే. అయితే.. ఓ విద్యార్థికి మాత్రం అస్సలు నచ్చలేదు. ఆ విద్యార్థికి నచ్చనది.. పరీక్షలు రద్దు చేయడం కాదు.. దీని కారణంగా తాము ఫేర్ వెల్ పార్టీ చేసుకోలేకపోతున్నామని.
మామూలుగా.. కాలేజీ వదిలి వెళ్లే విద్యార్థులకు జూనియర్లు.. ఫేర్ వేల్ పార్టీ ఇవ్వడం చాలా కామన్. ఈ కరోనా సమయంలో కాలేజీలే లేవు.. ఇక పార్టీలు ఎక్కడ ఉంటాయి. అందుకే.. ఓ స్టూడెంట్ ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.
తమకు ఫేర్వెల్ పార్టీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వమని.. అది కూడా.. స్నేహితులకు దూరమౌతున్నందుకు అనుకుంటే పొరపాటే. తన క్లాస్ మెట్ ఓ అమ్మాయిని చీరలో చూడాలని ఈ అబ్బాయికి కోరికట. ఈ పార్టీలో దాదాపు విద్యార్థులు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటారు. కదా.. అందుకోసం.. ఆ అమ్మాయిని చీరలో చూడాలనే తన కోరిక తీర్చుకోవడం కోసం.. ఫేర్వేల్ పార్టీ చేసుకోనివ్వండి ప్లీజ్ అంటూ.. ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం గమనార్హం.
ఈ విద్యార్థి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అతని కోరిక విని నెటిజన్లు నవ్వుకుంటారు. ఇక ఈ ట్వీట్ పై మీమ్స్ అయితే.. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి.
This post was last modified on June 3, 2021 10:29 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…