దేశంలో మరో కొత్త రకం ఫంగస్.. తొలికేసు నమోదు

కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని దేశప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ మహమ్మారే ఇంకా వదల్లేదురా భగవంతుడా అంటే.. రోజుకో కొత్త రకం ఫంగస్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే.. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ కేసులు వేలల్లో నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్నవారిని ఇప్పుడీ ఫంగస్ లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంకో విచిత్ర కేసు బయటపడింది.

కర్నాటకలోని చిత్రదుర్గలో స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ వెలుగు చూసింది. దేశంలోనే ఇది తొలి కేసు. 54 ఏళ్ల వ్యక్తికి స్కిన్ మ్యూకోయిడ్ మైకోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాధితుడు నెల రోజుల క్రితం కరోనా బారినపడి కోలుకున్నాడు. అతనికి షుగర్ కూడా ఉంది.

కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని చెప్పారు డాక్టర్లు. అక్కడ చర్మం నల్లగా అయిపోవడాన్ని గుర్తించారు. అన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.