సైకిల్ జ్యోతి.. గతేడాది ఈ పేరు దేశమంతటా మారుమోగింది. ఈ పేరు వినగానే ఆమె కథ అందతా మీకు గుర్తుకువచ్చే ఉంటుంది. గతేడాది కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న క్రమంలో లాక్ డౌన్ విధించారు. ఆ లాక్ డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించి తమ ఇంటికి తీసుకువచ్చింది. తండ్రి ప్రాణాలు కాపాడటానికి ఆమె చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఏడు రోజుల్లో ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడ విశేషం. దీనిని కొందరు వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారాయి.
ఆమె తండ్రి కోసం పడిన తపన.. అమెరికా మాజీ దేశాధ్యక్షుని కూతురు ఇవాంక ట్రంప్ ని కూడా ఆకట్టుకుంది. ఆమె ట్వీట్ తో ఈ సైకిల్ జ్యోతి ప్రపంచానికి కూడా చేరువైంది. కాగా.. ఇప్పుడు ఆ జ్యోతి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఏ తండ్రి కోసమైతే.. ఆమె గతేడాది అంత సాహసం చేసిందో.. సరిగ్గా ఏడాది తిరిగిలోపు ఆమె ఆ తండ్రి దూరమయ్యాడు. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ గుండెపోటుతో మరణించారు. ఈ వార్త అందరినీ కలచివేస్తోంది.
మోహన్ పాశ్వాన్ గురుగ్రామ్‌లో ఈ-రిక్షా నడిపేవారు. దేశవ్యాప్త కరోనా లాక్‌డౌన్ వల్ల రిక్షా యజమాని దానిని తీసుకున్నాడు. దీంతో ఆయనకు ఉపాధిలేకుండా పోయింది. పాశ్వాన్ కాలికి గాయం కావడంతో ఆయన బాగోగులు చూడటానికి 16 ఏండ్ల జోత్యి గురుగ్రామ్‌కు వెళ్లింది. అదే సమయంలో లాక్‌డౌన్ రావడం.. చేసేందుకు పనుల్లేక జీవనం కష్టంగా మారింది. దీనికితోడు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడం, తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో.. జ్యోతి ధైర్యం చేసి తండ్రిని సైకిల్ పై స్వగ్రామానికి తీసుకువచ్చింది.
This post was last modified on June 1, 2021 12:55 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…