రోగుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు దళారీలు కోవిడ్ టీకాను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఒకవైపు కోవిడ్ టీకాలు దొరకక, ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఐసీయూలో చేర్చుకోక రోగులు నాన అవస్తలు పడుతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళ్ళల్లోనే ఇండి కరోనా వైరస్ చికిత్స చేయించుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆసుపత్రుల్లో కానీ లేకపోతే ఇంట్లోనే చికిత్సలు చేయించుకున్నవారి పరిస్ధితి సీరియస్ అయిపోతే అప్పుడు పరిస్ధితి ఏమిటి ? సరిగ్గా ఇక్కడే దళారుల పాత్ర పెరిగిపోతోంది.
ఎప్పుడైతే దళారీల పాత్ర పెరిగిపోతోంది కోవిడ్ టీకాల ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకతున్నాయి. ముఖ్యంగా రెమ్ డెసివిర్ ధర చుక్కలు చూపిస్తోంది. ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారిలో ఎవరికైనా సీరియస్ అయిపోతే అప్పుడు రెమ్ డెసివిర్ ఇంజక్షన్ ఇస్తున్నారట. ఇంజక్షన్ తీసుకుంటున్నవారు వెంటనే కోలుకుంటున్నట్లు సమాచారం. దాంతో రెమ్ డెసివిర్ దివ్యఔషధం అనే ప్రచారం జరిగిపోతోంది. ఈ కారణంగానే ఈ ఇంజక్షన్ కు మార్కెట్లో విపరీతమైన గిరాకీ పెరిగిపోతోంది.
ఇదే సమయంలో ఆసుపత్రులకు ఈ ఇంజెక్షన్లు సరిపడా అందటంలేదన్నది వాస్తవం. రోగుల అవసరాలకు తగ్గట్లుగా సరఫరా ఉండని కారణంగానే బ్లాక్ మార్కెట్ పెరిగిపోతోంది. అందుకనే సీరియస్ అయిపోయిన రోగుల బంధులనే ఇంజక్షన్లు తెచ్చుకోమని డాక్టర్లు చెప్పేస్తున్నారు. ప్రాణాలమీదకు వచ్చేసిన కారణంగా రెమ్ డిసివిర్ కొనుగోలుకు ఎంత డబ్బైనా ఖర్చుపెట్టడానికి బంధులు వెనకాడటంలేదు. దీంతో రెమ్ డెసివిర్ ఒక వయల్ రు. 25 వేల నుండి రు. 40 వేలదాకా పలుకుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరైతే రు. 2500 మాత్రమే.
విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతున్న సమాచారం. ఈనెల 17వ తేదీకి ప్రభుత్వ డ్రగ్ స్టోర్లలో 48,232 వయల్స్, ఆసుపత్రుల్లో 2124 వయల్స్ అందుబాటులో ఉండేవి. అయితే అవసరాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో నిల్వలు తగ్గిపోతున్నాయి. శుక్రవారానికి డ్రగ్ స్టోర్లలో నిల్వలు 30 వేల వయల్స్ కు తగ్గిపోయిందంటేనే అవసరాలు ఎలా పెరిగిపోతున్నాయో అర్ధమవుతోంది.
కరోనా వైరస్ సోకిన ప్రతిపేషంటుకు రెమ్ డెసివిర్ అవసరం ఉండదు. కానీ పరిస్ధితి విషమించిన వారికి మాత్రమే అవసరం. అయితే ముందుజాగ్రత్తగా ఇంజక్షన్ వేసేసుకుంటే పరిస్దితి సీరియస్ అవ్వదుకదా అన్న జనాల ఆలోచన వల్లే ఇంజక్షన్ కు డిమాండ్ పెంచేసింది. 4 లక్షల వయల్స్ కు ప్రభుత్వం ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ మొత్తం వస్తే కాస్త డిమాండ్ తగ్గి అవసరమైన రోగులకు ఇంజక్షన్ మామూలు ధరకే దొరుకుతుందని అనుకుంటున్నారు.
This post was last modified on April 27, 2021 7:44 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…