కరోనా వైరస్ వ్యాప్తి మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. పది మందిలో ఎనిమిది మంది కరోనా పేషెంట్లు మగవాళ్లే. పురుషులు బయట ఎక్కువగా తిరగడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తి వారిలో ఎక్కువగా ఉన్నట్లు భావించారు. ఐతే కరోనా పేషెంట్లయిన మగవాళ్లు ఉన్న ఇళ్లలోనూ మహిళలకు వైరస్ అంతగా సోకట్లేదని తెలుస్తుండటంతో దీని వెనుక మతలబు ఏంటో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు.
ఐతే తాజాగా వెలువడిన ఓ అధ్యయనం దీని వెనుక కారణాలేంటో వెల్లడించింది. కోవిడ్-19 కారకమైన ‘సార్స్-కోవ్ 2’ వైరస్ యాంజియో టెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్-2 అనే ఎంజైమ్ ద్వారా కణాల్లోకి ప్రవేశిస్తున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్య సంస్థ కనుగొంది. ఇది కణాల ఉపరితలంపై ఉండి కరోనా వైరస్ లోనికి ప్రవేశించేందుకు తోడ్పడుతున్నట్లు తేల్చారు.
ఈ ఎంజైమ్ పురుషుల్లో అధికంగా ఉంటుందని.. అందుకే వాళ్లు తేలిగ్గా వైరస్ బారిన పడుతున్నారని వెల్లడైంది. మహిళల్లో ఈ ఎంజైమ్ తక్కువగా ఉండటం వల్ల వారికి వైరస్ ముప్పు తక్కువగా ఉంటోందని తేలింది.
ఈ ఎంజైమ్ గురించి కరోనా వైరస్ రావడానికి ముందే తాము అధ్యయనం జరిపామని.. హృద్రోగ సమస్యల్ని అధ్యయనం చేస్తుండగా పురుషుల్లో ఈ ఎంజైమ్ అధికంగా ఉన్నట్లు గుర్తించామని.. కరోనా వ్యాప్తి పెరుగుతున్న దశలో ఈ ఎంజైమ్ గురించి మరింతగా పరిశోధిస్తే కరోనా వ్యాప్తికి అది దోహదపడుతున్నట్లు తేలిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులను నియంత్రించడానికి వాడే యాంజియో టెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్‌ను కరోనా వైరస్ రోగులకు ఇవ్వడం ద్వారా వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చని కూడా ఈ అధ్యయనంలో తేలింది.
This post was last modified on May 11, 2020 3:32 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…