ఇటీవల ‘బాయ్స్ లాకర్ రూం’ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్క్రీన్ షాట్లు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. అమ్మాయిని రేప్ చేయడం గురించి స్కూల్ విద్యార్థులు జరిపిన చాట్‌లు చూసి నెటిజన్లు షాకైపోయారు. అంత చిన్న వయసులో అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడం గురించి దారుణంగా మాట్లాడుకోవడం ఆందోళన కలిగించింది.
ఈ తరం కుర్రాళ్లు చిన్న వయసులోనే ఎలా చెడిపోతున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం అంటూ ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయంలో ఆ పిల్లల తల్లిదండ్రుల్ని విమర్శించిన వాళ్లూ లేకపోలేదు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై దృష్టిసారించిన పోలీసులు.. విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చాట్ వెనుక ఉన్నది ఓ అమ్మాయి అని వెల్లడైంది.
అబ్బాయిల క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడం కోసం ఓ అమ్మాయి.. ‘సిద్దార్థ్’ అనే అబ్బాయి పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిని రేప్ చేసే టాపిక్ మీద చర్చ మొదలుపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చాట్ సెషన్లో పాల్గొన్న ఓ అబ్బాయి.. ఈ టాపిక్ మీద మాట్లాడేందుకు నిరాకరించినా, బలవంతంగా అతణ్ని ఇందులోకి ఆ అమ్మాయి లాగినట్లు విచారణలో తేలింది.
అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసే ప్రతిపాదన గురించి చాట్ సెషన్లో ఈ అమ్మాయే ప్రతిపాదన చేసి.. దాని గురించి అవతలి కుర్రాళ్లు చర్చించేలా చేసిందని.. ఈ చర్చకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఒక అబ్బాయి తన స్నేహితులతో పంచుకోగా.. ఒక కుర్రాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని.. దీంతో అది వైరల్ అయి పోలీసులు జోక్యం చేసుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై రెచ్చిపోయి మాట్లాడిన ఫెమినిస్టులంతా ఇప్పుడు ఏమంటారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘బాయ్స్ లాకర్ రూం ట్రూత్’ పేరుతో హ్యష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేస్తున్నారు.
This post was last modified on May 11, 2020 2:27 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…