కాలం మారింది. నేరాల తీరులోనూ మార్పులు వచ్చేశాయి. అదివరకు దొంగతనం.. ఘర్షణలు.. ఇలాంటి కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అదంతా మారింది. సైబర్ మోసాలు.. ఎదుటోడి అవసరాన్ని.. అత్యాశను.. కోరికను కొట్టి డబ్బులు దోచేసే తీరు ఎక్కువైంది. గతంలో నేరాలు చేసే వారి జాబితాలో మగాళ్లు ఎక్కువగా.. ఆడాళ్లు తక్కువగా కనిపించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మహిళలు కూడా దారుణ మోసాలకు.. నేరాలకు తెర తీస్తున్న పరిస్థితి.
తాజాగా అలాంటి కిలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళగా భావిస్తున్న అంజలి అలియాస్ భాగ్ వతిని రాజస్తాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె పెళ్లి పేరుతో వల వేసి.. పెళ్లి చేసుకొని అదుపుచూసి.. నగలు.. నగదు పట్టుకొని ఉడాయించేది. ఇప్పటివరకు దాదాపు 18 మందిని ఇదే తీరులో పెళ్లాడి మోసం చేసినట్లు గుర్తించారు.
తాజాగా జానాగఢ్ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన యువకుడ్నిపెళ్లాడిన ఆమె.. రూ.3లక్షలతో పారిపోయింది. దీంతో.. ఆమె మోసాన్ని గుర్తించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వలపన్నిన పోలీసులు ఆమెను సెల్ ఫోన్ నెంబరు సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అంజలి తల్లిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే.. షాకింగ్ నిజాలుబయటకు వచ్చాయి. ఇప్పటివరకు తాము 18 మందిని పెళ్లాడినట్లుగా ఒప్పుకున్నారు. బాధితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
This post was last modified on March 21, 2021 3:13 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…