స్కూల్ కు వెళ్లమంటే చాలు ఎగిరి గంతేసి ఎప్పుడెప్పుడు వెళదామా? అని ఆశగా చూస్తారు. అయితే.. కొందరికి స్కూల్ అంటే ఇష్టం ఉండదు. వెళ్లేందుకు ఇష్టపడరు. ఇలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు మందలించటం.. స్కూల్ కు వెళ్లమని పోరు పెట్టటం చేస్తుంటారు. అదంతా కూడా పిల్లల మీద తమకున్న ప్రేమ..వారు పెద్దాయక కష్టపడకుండా ఉండాలనే. కానీ..ఈ విషయాన్ని అర్థం చేసుకొని కొందరు పిల్లలు చేసే పనులు షాకింగ్ గా మారతాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది.
హైదరాబాద్ శివారులోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే విజయకుమార్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతడికి ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కుమార్తెలు. పెద్ద కొడుకు అర్జున్ స్థానిక స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల స్కూల్ ప్రారంభం కావటంతో అతడ్ని బలవంతంగా పంపారు. తనకు స్కూల్ ఇష్టం లేదని ఎంత చెప్పినా వారు ఒప్పుకోలేదు. స్కూల్ కు వెళ్లాలంటూ ఒత్తిడి చేసి మందలించారు.
దీంతో.. మనస్తాపానికి గురైన అర్జున్.. తండ్రి ఇంట్లో లేని వేళ బాత్రూంలోకి వెళ్లి టవల్ తో ఊరి వేసుకున్నారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో తలుపు తీసి లోపలకు వెళ్లారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులుధ్రువీకరించారు. బిడ్డ భవిష్యత్తు కోసం చదువుకోమని చెబితే ఇలా ఉసురు తీసుకుంటాడని ఊహించలేదని కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. ఈ ఉదంతం స్థానికంగా షాకింగ్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates