డ్రాగన్ దేశం తెంపరితనం ప్రపంచానికి తెలిసిందే కానీ మరీ ఇంత నీచానికి దిగజారిపోతుందని ఎవరు అనుకోలేదు. మనదేశంలో తయారవుతున్న కరోనా వైరస్ టీకా వివరాలను దొంగలించేందుకు పెద్ద ప్రయత్నమే చేసింది. సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఫార్ములాలను, తయారీ విధానాన్ని దొంగలించేందుకు ప్రయత్నం చేసినట్లు తాజాగా బయటపడింది.
భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ వివరాలను దొంగలించేందుకు సీరం ఇన్ స్టిట్యూట్ కంపెనీ కంప్యూటర్లలోకి మాల్ వేర్ ను ప్రవేశపెట్టినట్లు సైబర్ సెక్యురిటి సై ఫార్మా బయటపెట్టింది. సీరమ్ తో పాటు భారత్ బయోటెక్ సంస్ధలకు చెందిన కంప్యూటర్లలోకి మాల్ వేర్ ను ప్రవేశపెట్టడాన్ని తాము గుర్తించినట్లు సైబర్ సెక్యురిటి ప్రకటించిటం సంచలనంగా మారింది.
చైనా హ్యాకింగ్ గ్రూప్ స్టోన్ పాండా పై రెండు సంస్ధల్లోని ఐటి వ్యవస్ధల్లో ఉన్న లోపాల ఆధారంగా మాల్ వేర్ ను చొప్పించింది. వ్యాక్సినేషన్ వివరాలను దొంగిలించి మేథోసంపత్తి హక్కుల వివరాలను కూడా తస్కరిచిం ఫార్మా కంపెనీలపై ఆధిపత్యం సాధించాలన్నది చైనా ఎత్తుగడగా అర్ధమవుతోంది. ఎప్పుడైతే అనుమానం వచ్చి మాల్ వేర్ చొప్పించినట్లు గ్రహించారో వెంటనే సీరం కంపెనీకి చెందిన ఐటి వ్యవస్ధలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కరోనా వైరస్ టీకాలను చైనా కూడా తయారుచేస్తున్న ప్రపంచంలో వాడుతున్న టీకాల్లో 60 శాతంకు పైగా మనదేశంలో తయారైనవే. దాంతో చైనాకు మండిపోతోంది. అందుకనే భారత్ ను ఎలాగైనా దెబ్బకొట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియలో పై చేయి సాధించాలని అనుకున్నది. కాకపోతే ప్రారంభంలోనే మాల్ వేర్ ను గుర్తించటంతో సమస్య తప్పింది. అయితే ఈ విషయాన్ని పై రెండు కంపెనీలు కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. చూడాలి కేంద్రప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.