గూగుల్ స్టార్ట్ అయిన రోజున దాని గురించి తెలిసినోళ్లు చాలా తక్కువ. ఫేస్ బుక్ లాంఛ్ చేసినప్పుడు దాని స్థాయి ఇప్పుడున్న రేంజ్ లో ఉందని భావించినోళ్లు చాలా.. చాలా తక్కువ. అంతదాకా ఎందుకు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యాపిల్ ప్రారంభమైనప్పుడు.. ప్రపంచ మార్కెట్ ను ఏలుతుందని అంచనా వేశారా? వేసి ఉండరు. ఇప్పుడు మాత్రం ఆ అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటి? అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారు? దాని వెనుక ఎవరున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తే..
కార్ల్.. పేరు విన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు అన్నంతనే బిజినెస్ వర్గాలతో పాటు.. టెక్ అంశాల మీద పట్టున్న వారందరికి గుర్తుకు వచ్చేస్తాడు. వన్ ప్లస్ కంపెనీ ఈ రోజున ఈ స్థాయిలో ఉండటంలో అతను కీలకంగా అభివర్ణిస్తారు. అలాంటి కార్ల్.. వన్ ప్లస్ నుంచి బయటక వచ్చేశాడు. తానే సొంతంగా కంపెనీ పెట్టేశాడు. దాని పేరు ‘నథింగ్’గా పెట్టి మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాడు.
గత అక్టోబరులో వన్ ప్లస్ నుంచి బయటకు వచ్చేసిన ఇతడు.. ఇప్పుడేం తయారు చేయనున్నది బయటపెట్టటం లేదు. 31 ఏళ్ల చిన్న వయసులో లండన్ కేంద్రంగా షురూ చేసిన అతడి కంపెనీ.. రానున్న రోజుల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏం ఉత్పత్తి చేసేది చెప్పకున్నా.. అతడి శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉన్న వారంతా.. అతడి నథింగ్ కంపెనీ నుంచి వచ్చే ఉత్పత్తులు అదరగొట్టే అవకాశం ఉందంటున్నారు.
ఇంతకీ మీరేం తయారు చేయబోతున్నారన్న ప్రశ్నకు కార్ల్ చెప్పే సమాధానం కాస్త చిత్రంగా ఉండటమే కాదు.. క్రియేటివిటి ఉండటం గమనార్హం. ‘మేం ప్రతి విషయాన్ని పునరాలోచిస్తున్నాం. ఏం తయారు చేయాలి? ఎలా తయారు చేయాలి? కొత్తగా ఏం రాబోతోంది? ఏం వెళ్లిపోనుంది? లాంటివెన్నో ఆలోచిస్తున్నాం. సరికొత్త ఆవిష్కరణ కోసం భారీ రీసెట్ బటన్ ఇది’ అంటూ తన నథింగ్ గురించి చెప్పాడు. పేరుకు తగ్గట్లే.. అతడి ఉత్పత్తులు భిన్నంగా ఉంటాయన్న మాట మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
This post was last modified on January 28, 2021 6:38 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…