Trends

గీతాంజలి కోసం బాధ పడుతున్నారు

అక్కినేని నాగార్జున కెరీర్ లో గీతాంజలి ఎంత ఎవర్ గ్రీన్ క్లాసిక్కో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగులో తీసిన ఒకే ఒక్క టాలీవుడ్ మూవీగా కూడా అరుదైన ఘనత సాధించింది. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న 1989లో ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఫ్లాప్ టాక్ తో మొదలై క్రమంగా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పటికీ ఇళయరాజా పాటలు ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటాయి. అంత గొప్ప ట్రాక్ రికార్డు గీతాంజలి సొంతం.

ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత గీతాంజలి రీ రిలీజ్ కానుంది. నవంబర్ 13 నుంచి థియేటర్లకు వస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తున్నారు. హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ మొదలైపోయాయి. అయితే కింగ్ ఫ్యాన్స్ మాత్రం ఈ టైమింగ్ పట్ల తెగ బాధ పడుతున్నారు. ఎందుకంటే రామాయణ పార్ట్ 1, సీన్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నాయి. రెండో వారంలో కూడా చెప్పుకోదగ్గ థియేటర్లు హోల్డ్ చేసుకుని డ్రీమ్ రన్ కొనసాగిస్తున్నాయి. వీకెండ్ ఇంకా జోరుగా ఉంటాయి.

ఇంకోవైపు నవంబర్ 12, 13 తేదీల్లో ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిలో నాగార్జునే సమర్పిస్తున్న ఇట్లు అర్జున కూడా ఉంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అఖిల్, రామ్ చరణ్ గెస్టులుగా వచ్చారు. ఇంత టైట్ షెడ్యూల్ లో గీతాంజలిని ఎవరు పట్టించుకుంటారనేది అభిమానుల ఆవేదన. ఇదంతా ముందే పసిగట్టిన ముఠామేస్త్రి తెలివిగా నవంబర్ 22కి వెళ్ళిపోయింది. ఆ టైంలో కాంపిటీషన్ ఇంత తీవ్రంగా ఉండదు.

నాగార్జున రీ రిలీజుల్లో అద్భుతమైన స్పందన తెచ్చుకున్న వాటిలో శివ మొదటి స్థానంలో ఉంటుంది. అది వచ్చినప్పుడు మార్కెట్ లో పెద్దగా కాంపిటీషన్ లేదు. కానీ గీతాంజలికి అంత సానుకూలత లేదు. ఇంకా ఏపీ తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయి బుకింగ్స్ ఓపెన్ కాలేదు. వరల్డ్ వైడ్ రెండు వేలకు పైగా షోలు వేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే అంత ఉండకపోవచ్చు. ఏది ఎలా ఉన్నా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే వాటిలో గీతాంజలి అయితే ఉంటుంది.

This post was last modified on November 10, 2026 9:48 pm

Share

Recent Posts

రిటైర్మెంట్ వరకు ఊరట లేనట్టే.. సంజయ్‌కు మరో దెబ్బ!

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్ చెప్పార‌నో.. లేక ఆయ‌న మెప్పు పొందాల‌నో భావించిన కొంద‌రు ఉన్న‌తాధికారులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించారు.…

4 hours ago

పుణ్యం వస్తుంది ఇలాంటి ఆఫర్లు పెడితే

చిన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం, జనాన్ని థియేటర్లకు రప్పించేలా చేయడం పెద్ద సవాల్ గా మారుతున్న ట్రెండ్…

5 hours ago

పెండింగ్ కేసులకు ఫాస్ట్ ట్రాక్.. ఏపీకి రానున్న ఈవెనింగ్ కోర్టులు..

దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. న్యాయ…

6 hours ago

డేంజర్ గేమ్ ఆడుతున్న విశ్వంభర

ఒకవైపు కాకా పదే పదే జనవరి 13 విడుదల అవుతుందంటూ టీమ్ సోషల్ మీడియాలో ఒకటే ఊరిస్తోంది. ఇంకోవైపు విశ్వంభర…

6 hours ago

తాత ఆస్తి నీకు రాదు మనవడా…

తాతల నుంచి తండ్రులకు వచ్చిన ఆస్తిలో మనవళ్లకు కూడా సమాన వాటా ఉంటుందా? తండ్రి తనకు వచ్చిన ఆస్తిని విక్రయించాలంటే…

7 hours ago

అప్పుడు షారుఖ్… ఇప్పుడు సూర్య

2000 సంవత్సరానికి ముందు రోజుల్లో ఆ భాష, ఈ భాష అని తేడా లేకుండా స్టార్ హీరోలు ఏడాదికి మూణ్నాలుగు…

7 hours ago