2000 సంవత్సరానికి ముందు రోజుల్లో ఆ భాష, ఈ భాష అని తేడా లేకుండా స్టార్ హీరోలు ఏడాదికి మూణ్నాలుగు రిలీజ్‌లు ఉండేలా చూసుకునేవారు. ఇంకా వెనక్కి వెళ్తే ఒక ఏడాదిలో డబుల్ డిజిటల్ సినిమాలు రిలీజ్ చేసిన హీరోలను కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు పెద్ద స్టార్ల నుంచి ఏడాదికి ఒక సినిమా రావడం కూడా కష్టమైపోతోంది. ఇలాంటి టైంలో ఒక సూపర్ స్టార్ నుంచి ఒకే ఏడాది మూడు సినిమాలు రావడం, ఆ మూడూ బ్లాక్‌బస్టర్ సక్సెస్ కావడం అనూహ్యమైన విషయం.
తమిళ నటుడు సూర్య ఈ ఘనతే సాధించాడు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు రిలీజ్‌లతో ప్రేక్షకులను పలకరించిన సూర్య.. మూడు సినిమాలతోనూ ఘనవిజయాలందుకున్నాడు. పదేళ్లకు పైగా సరైన విజయం లేక ఇబ్బంది పడిన సూర్య.. ఈ ఏడాది మేలో రిలీజైన ‘కరుప్పు’తో ఆల్ టైం బిగ్ హిట్ కొట్టాడు. రూ.330 కోట్ల కలెక్షన్స్‌తో సూర్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందీ చిత్రం.
ఇంకో మూడు నెలలకు సూర్య నుంచి వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇప్పుడు ‘సీన్’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఆల్రెడీ రూ.100 కోట్ల మార్కును దాటేసిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో ఈజీగా రూ.200 కోట్ల మార్కును దాటేలా కనిపిస్తోంది. సూర్య గత రెండు చిత్రాలతో పోలిస్తే దీని బడ్జెట్ తక్కువ. లాభాలు మాత్రం వాటి కంటే ఎక్కువే రాబోతున్నాయి.
ఓవరాల్ వసూళ్లు వాటితో పోలిస్తే తక్కువ వచ్చినా.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే వాటి కంటే ఇది పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేసి, మూడూ క్లీన్ హిట్స్ ఇవ్వడం అన్నది అసామాన్యమైన విషయం. 2023లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో విజయాలందుకున్నాడు కానీ.. వీటిలో ‘డంకీ’ పూర్తి సంతృప్తినైతే ఇవ్వలేకపోయింది. కానీ సూర్య మాత్రం మూడు చిత్రాలతోనూ ఘనవిజయాలు అందుకున్నాడు.
This post was last modified on November 10, 2026 9:25 pm
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. న్యాయ…
ఒకవైపు కాకా పదే పదే జనవరి 13 విడుదల అవుతుందంటూ టీమ్ సోషల్ మీడియాలో ఒకటే ఊరిస్తోంది. ఇంకోవైపు విశ్వంభర…
తాతల నుంచి తండ్రులకు వచ్చిన ఆస్తిలో మనవళ్లకు కూడా సమాన వాటా ఉంటుందా? తండ్రి తనకు వచ్చిన ఆస్తిని విక్రయించాలంటే…
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ తాను రాసుకున్న జీవిత చవిత్ర బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్…
అగ్రరాజ్యంలో దీపావళి సెలవు.. అనగానే మన దేశంలోనే కదా.. అమెరికాలో ఎందుకు ఉంటుంది? అక్కడి క్రిస్టియన్ నాయకులు దీపావళికి ఎందుకు…
నవంబర్ నెలలో ప్రతివారం బాక్సాఫీస్ క్లాషులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఒకేసారి మూకుమ్మడిగా కొత్త రిలీజులు దాడి చేయడం కొంత వరకు…