Political News

రిటైర్మెంట్ వరకు ఊరట లేనట్టే.. సంజయ్‌కు మరో దెబ్బ!

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్ చెప్పార‌నో.. లేక ఆయ‌న మెప్పు పొందాల‌నో భావించిన కొంద‌రు ఉన్న‌తాధికారులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసుకుని వేధించారు. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు..ఐపీఎస్ అధికారి ఎన్‌. సంజ‌య్‌. చంద్ర‌బాబును క‌ర్నూలు జిల్లాలో అరెస్టు చేసింది ఈయ‌నే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. అది ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని.. త‌న‌కు వ్య‌క్తిగ‌త రాజ‌కీయ అభిలాష‌లేమీ లేవ‌ని సంజ‌య్ అప్ప‌ట్లో వివ‌రించారు. ఆ త‌ర్వాత‌.. ఈ అధికారే.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విశాఖ‌ప‌ట్నంలో హోటల్‌కు ప‌రిమితం చేయాల‌ని ఆదేశించిన‌ట్టు వార్త‌లు రావ‌డం తెలిసిందే.

కాగా.. ప్ర‌భుత్వం మారి.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. సంజ‌య్ ప‌లు కేసుల్లో చిక్కుకున్నారు. ఇవి రాజ‌కీయ ప‌ర‌మైన కేసులు కావు. సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం కేటాయించిన నిధుల‌ను త‌న సొంతానికి ఖ‌ర్చు పెట్టుకున్నార‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం. ఈ కేసులోనే ఆయ‌న‌ను గ‌తంలో అరెస్టు చేశారు. కొన్నాళ్లు జైల్లో ఉండి.. త‌ర్వాత బెయిల్‌పై వ‌చ్చారు. ఇక‌, 2024, డిసెంబ‌రు నుంచి కూడా స‌స్పెన్ష‌న్‌లోనే ఉన్న సంజ‌య్‌కు తాజాగా మ‌రో షాక్ త‌గిలింది. ఈ స‌స్పెన్ష‌న్‌ను ప్ర‌భుత్వం వ‌చ్చే మార్చి 31 వ‌ర‌కు పెంచింది. అంటే.. అప్ప‌టికి ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి రిటైర్ కానున్నారు. అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న స‌స్పెన్ష‌న్‌ను పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది.

ఎంత అవినీతి చేశారు?

ఐపీఎస్ సంజ‌య్‌పై మొత్తం మొత్తం కోటీ 75 ల‌క్ష‌ల రూపాయ‌ల అవినీతి ఆరోప‌ణ‌లు వచ్చాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన సమయంలో.. అగ్ని-ఎన్‌ఓసీ వెబ్ పోర్టల్ అభివృద్ధి, నిర్వహణ, టెండర్ల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణ పై కేసు న‌మోదైంది. అగ్నిమాపక శాఖ అధికారుల కోసం ఈ-టెండర్లు లేదా పోటీ బిడ్డింగ్ లేకుండా రూ. 17.89 లక్షల విలువైన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో, యాపిల్ ఐప్యాడ్ ప్రో పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని విచారణలో తేలింది.

అలాగే ఎస్సీ, ఎస్టీ కేసుల‌పై డీఎస్పీల‌కు అవగాహన క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సదస్సులు నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలో వీటి నిర్వ‌హ‌ణ‌కు కేటాయించిన నిధుల దుర్వినియోగంలో ఆయ‌న పాత్ర ఉంద‌ని తేలింది. సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ కోసం రూ. 1.19 కోట్లతో ‘కృతివ్యాప్ టెక్నాలజీస్’ అనే సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. అయితే ఆ సంస్థ అసలు మ‌నుగ‌డ‌లో లేదని, కేవలం రూ. 3.10 లక్షలతో సదస్సులు నిర్వహించి మిగిలిన సుమారు రూ. 1.15 కోట్లను పక్కదారి పట్టించారని ఏసీబీ పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ కేసులు విచార‌ణ ద‌శ‌లోనే ఉన్నాయి.

This post was last modified on November 10, 2026 9:37 pm

Share

Recent Posts

గీతాంజలి కోసం బాధ పడుతున్నారు

అక్కినేని నాగార్జున కెరీర్ లో గీతాంజలి ఎంత ఎవర్ గ్రీన్ క్లాసిక్కో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగులో…

2 hours ago

పుణ్యం వస్తుంది ఇలాంటి ఆఫర్లు పెడితే

చిన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం, జనాన్ని థియేటర్లకు రప్పించేలా చేయడం పెద్ద సవాల్ గా మారుతున్న ట్రెండ్…

5 hours ago

పెండింగ్ కేసులకు ఫాస్ట్ ట్రాక్.. ఏపీకి రానున్న ఈవెనింగ్ కోర్టులు..

దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. న్యాయ…

6 hours ago

డేంజర్ గేమ్ ఆడుతున్న విశ్వంభర

ఒకవైపు కాకా పదే పదే జనవరి 13 విడుదల అవుతుందంటూ టీమ్ సోషల్ మీడియాలో ఒకటే ఊరిస్తోంది. ఇంకోవైపు విశ్వంభర…

6 hours ago

తాత ఆస్తి నీకు రాదు మనవడా…

తాతల నుంచి తండ్రులకు వచ్చిన ఆస్తిలో మనవళ్లకు కూడా సమాన వాటా ఉంటుందా? తండ్రి తనకు వచ్చిన ఆస్తిని విక్రయించాలంటే…

7 hours ago

అప్పుడు షారుఖ్… ఇప్పుడు సూర్య

2000 సంవత్సరానికి ముందు రోజుల్లో ఆ భాష, ఈ భాష అని తేడా లేకుండా స్టార్ హీరోలు ఏడాదికి మూణ్నాలుగు…

7 hours ago