అగ్రరాజ్యంలో దీపావళి సెలవు.. అనగానే మన దేశంలోనే కదా.. అమెరికాలో ఎందుకు ఉంటుంది? అక్కడి క్రిస్టియన్ నాయకులు దీపావళికి ఎందుకు సెలవు ఇస్తారు? అనే సందేహాలు వస్తాయి. నిజమే. ఇంకా సెలవుగా తీర్మానం చేయలేదు. ప్రకటించనూలేదు. అయితే.. ఇప్పుడు ఈ విషయం అక్కడి పార్లమెంటు(సెనేట్)కు చేరింది. ఈ సభలో సభ్యులు ఆమోదం తెలిపితే.. అధ్యక్షుడు ఓకే అంటే సెలవుగా మారుతుంది. ప్రస్తుతం ఈ విషయం అమెరికా సహా భారత్ లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
విషయం ఏంటి?
భారత సంతతి పౌరులు, ప్రవాస భారతీయుల సంఖ్య అమెరికాలో పెరుగుతోంది. పైగా మన దేశానికి చెందిన వారు చాలా మంది చట్టసభలకు ఎన్నిక అవుతున్నారు. అంతేకాదు.. భారత్-అమెరికా దేశాల మధ్య సంస్కృతి, సాహిత్య సంబంధాలు కూడా మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయులకు అక్కడి ప్రభుత్వం, పార్టీలు కూడా ప్రాధాన్యం పెంచుతున్నాయి. రాజా కృష్ణమూర్తి వంటివారు కీలక రోల్ పోషిస్తున్నారు. భారత సంతతి మూలాలున్న రో.. ఖన్నా వంటివారి ప్రాధాన్యమూ ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు ఎక్కువగా నిర్వహించుకున్న దీపావళిని ప్రభుత్వ అధికారిక సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ 2000 సంవత్సరం నుంచే వినిపిస్తోంది. ఒకదశలో అంటే.. 2023లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దీనికి సంబంధించిన బిల్లును కూడా తీసుకువచ్చారు. అయితే.. ఇది అప్పట్లో చర్చకు రాలేదు. ఆ తర్వాత.. మరోసారి ప్రయత్నించారు కానీ, ఫలితం దక్కలేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ఎన్నికల్లో తన పార్టీ ఓటమి తర్వాత.. మనసు మార్చుకున్నారు.
భారతీయ సంప్రదాయ దీపావళి వేడుకలను అమెరికా అధ్యక్షుడి భవనం వైట్ హౌస్‌లోనూ ఘనంగా నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓవల్ ఆఫీస్‌లో సాంప్రదాయ దీపాన్ని వెలిగించి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ జై భట్టాచార్య, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణతో పాటు పలువురు భారతీయ అమెరికన్ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ మూలాలు ఉన్న వ్యాపారవేత్త విశాల్ గోండల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాను బహూకరించారు.
ఈ సందర్భంగానే మరోసారి దీపావళి సెలవు విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే ఉన్న బిల్లును బయటకు తీయాలని అధ్యక్షుడు చెప్పినట్టు భారత సంతతి నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం 19 మంది మద్దతు ఉందని.. మరో 20 మంది మద్దతు కూడగడితే.. బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. ఈ దిశగానే చర్యలు చేపట్టారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆమోదానికి రెడీగానే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో.. ఇది సక్సెస్ అయితే.. అమెరికాలో దీపావళి సెలవు అధికారికం కానుంది.
This post was last modified on November 10, 2026 5:29 pm
నవంబర్ నెలలో ప్రతివారం బాక్సాఫీస్ క్లాషులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఒకేసారి మూకుమ్మడిగా కొత్త రిలీజులు దాడి చేయడం కొంత వరకు…
ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ సహా కూటమి భాగస్వామ్య…
ఇట్లు అర్జునకు ఇండస్ట్రీలో దక్కుతున్న మద్దతు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాగార్జున వరకు బిగ్ షాట్స్…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తాము విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని,…
వైసీపీ భవిష్యత్తుకు, పార్టీ పునర్నిర్మాణానికి ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్ర అత్యంత కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు…
రామాయణ పార్ట్ 1 వసూళ్లు కొత్త చరిత్ర రాస్తున్నాయి. మొదటి వారం కాకుండానే 700 కోట్ల వైపు పరుగులు పెడుతున్న…